https://oktelugu.com/

AI : సర్కార్ బడిలో ఏఐ విప్లవం…రాష్ర్ట వ్యాప్తంగా ఏఐ ద్వారా విద్యా బోధన.. ఎప్పటినుంచి అంటే?

AI : తెలంగాణ రాష్ర్టంలోని అన్ని జిల్లాలలో ఎంపిక చేసిన ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 15 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) ఏ.ఐ ను వినియోగిస్తూ సులభతరంగా విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టారు.

Written By:
  • Srinivas
  • , Updated On : March 14, 2025 / 08:36 AM IST
    AI

    AI

    Follow us on

    AI : తెలంగాణ రాష్ర్టంలోని అన్ని జిల్లాలలో ఎంపిక చేసిన ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 15 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) ఏ.ఐ ను వినియోగిస్తూ సులభతరంగా విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ ఈ విషయమై జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. పాఠ‌శాల‌ విద్యార్థుల‌ ప‌రిజ్ఞానం, నైపుణ్యం పెరిగేందుకు చేస్తున్న ప్ర‌యత్నాల‌లో భాగంగా రాష్ట్రంలోని స‌ర్కార్ బ‌డుల్లో విద్యార్థుల పఠన సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్య‌ను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరిలో సర్కార్ బడిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తూ విద్యార్థులకు సులభతరంగా విద్య బోధన చేసేందుకు గతంలో పైలెట్ ప్రాజెక్టు కింద 6 జిల్లాలో ప్రారంభించారు. వాటిలో..

    Also Read : విద్యాసంస్థలకు సీరియస్ వార్నింగ్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.

    మెదక్ జిల్లాలో బూర్గుపల్లి, మాసాయిపేట , నిజాంపేట,తూప్రాన్, కాళ్లకల్, నర్సాపూర్, మండల పరిషత్​ ప్రైమరీ స్కూల్స్​ఎంపికయ్యాయి. భద్రాద్రి జిల్లాలో హన్మాన్​బస్తీ, కేటీపీఎస్​ కాలనీ, వికలాంగుల కాలనీ, తాతగుడిసెంటర్​, పాలకొయ్య తండా, ఓల్డ్​ కొత్తగూడెం ప్రైమరీ స్కూల్, ఖమ్మం జిల్లాలో ఎన్ఎస్ సీ ఖమ్మం, మల్లెమడుగు, పాండురంగాపురం, సత్తుపల్లి, సింగారెడ్డిపాలెం, రాజేంద్రనగర్ ప్రైమరీ స్కూల్స్, మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలో జనతానగర్, కొంపల్లి, ప్రగతి నగర్​, మల్లాపూర్, ఎల్లమ్మ బండ, బహదూర్​పల్లి, నారాయణపేట్​జిల్లాలో గూడె బెల్లూర్, ముడుమల్, కొల్లంపల్లె, దామరగిద్ద, కర్ని, శివాజీ నగర్, వికారాబాద్​ జిల్లాలో ఓల్డ్​తాండూరు(తెలుగు మీడియం), దౌల్తాబాద్​, కొట్​బాస్​పల్లి, రేగడ్​మేల్వేర్, మల్కాపూర్​గని, తాండూర్​(ఉర్దూ మీడియం) స్కూళ్లలో ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ విద్య‌ను అందించే ప్రోగ్రామ్ అమలైంది.

    అది మంచి ఫలితాలు ఇచ్చినందున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు, అభ్యాస సామర్థ్యాలు పెంపొందించేందుకు ప్రతి జిల్లాలో కొన్ని ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది. ఆయా జిల్లాల్లో ముందస్తుగా ఎంపిక చేసిన పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులకు ఏ.ఐ వినియోగిస్తూ సులభతరంగా విద్యా బోధన చేయాలని నిర్ణయించారు. ఏ.ఐ. కోర్సు ద్వారా విద్యార్థులకు బోధన చేసేందుకు వీలుగా ప్రతి పాఠశాలలో ఐదు కంప్యూటర్లు, అవసరమైన ఇంటర్నెట్ కనెక్షన్, హెడ్ ఫోన్స్ ఇతర సామాగ్రి అందుబాటులో ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి సూచించారు. జిల్లాలో ముందుగా ఎంపిక చేసిన పాఠశాలలో ఏ ఏ కోర్సు ద్వారా విద్య బోధన జరుగుతుందని, ఇక్కడ వచ్చే ఫలితాలను అంచనా వేస్తూ భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరించి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

    ఇక ఏఐ ద్వారా విద్యార్థి సామర్థ్యం పెంపొందించే విషయంలో ఏఐ ముఖ్య భూమిక పోషించనుంది. వారి సామర్థ్యం మెరుగుపరిచే విధానంలో ఏఐ ఎంతగానో ఉపయోగపడనుంది.

    Also Read : మార్కులు, ర్యాంకులు కాదు.. పనికే పెద్ద పీట.. చైనా నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.. వీడియో వైరల్