Virat Kohli (7)
Virat Kohli: టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించిన సంఘటన తెలిసిందే. పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన మ్యాచ్ లలో విరాట్ కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. అందువల్లే ఆ జట్లపై జరిగిన మ్యాచ్ లలో భారత్ గెలిచింది.
Also Read: టీమిండియా దిగ్గజ క్రికెటర్ కన్నుమూత.. క్రికెట్ కు ఆయన చేసిన సేవలు ఎటువంటివంటే..
విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్లో విఫలమైనప్పటికీ.. ఛాంపియన్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో నిలిచాడు. తన వయసు 36 సంవత్సరాలు అయినప్పటికీ.. యువకులతో పోటీపడుతూ విరాట్ పరుగులు చేయడం విశేషం. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు ఆడిన ఇన్నింగ్స్ అద్భుతంగా నిలిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో విరాట్ స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అందువల్లే టీం ఇండియా ఆ మ్యాచ్లలో విజయం సాధించింది. ఇక టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన నేపథ్యంలో విరాట్ పై కూడా ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రోజు ట్విట్టర్లో #virat the goat అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఈ యాష్ ట్యాగ్ లో మిలియన్ల ట్వీట్లు పడ్డాయి.
తండ్రితో సంతోషాన్ని పంచుకున్న కోహ్లీ..
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత.. టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ తన ఆనందాన్ని తండ్రితో పంచుకున్నాడు. వాస్తవానికి విరాట్ కోహ్లీ తండ్రి కాలం చేసి చాలా సంవత్సరాలు గడిచింది.. అలాంటప్పుడు విరాట్ కోహ్లీ తన సంతోషాన్ని తండ్రితో ఎలా పంచుకుంటారు? అనే ప్రశ్న మీలో మెదులుతోంది కదూ. అయితే విరాట్ కోహ్లీ తన తండ్రితో ఆనందాన్ని పంచుకున్న విషయం వాస్తవమే. కాకపోతే దానిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఓ నెటిజన్ ఎడిట్ చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. విరాట్ కోహ్లీ తండ్రి ప్రేమ్ నాథ్ పాత ఫోటోను, విరాట్ కోహ్లీ ప్రస్తుత ఫోటోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసి..ఓ నెటిజన్ ఆ వీడియోను రూపొందించాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోని చూసిన విరాట్ కోహ్లీ అభిమానులు.. ఇప్పుడు గనక ప్రేమ్ నాథ్ జీవించి ఉంటే సంతోషించే వారిని వ్యాఖ్యానిస్తున్నారు. ” విరాట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఢిల్లీ నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ప్రపంచమే హద్దుగా సాగిపోతున్నాడు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. ఆట ద్వారా కోట్లాదిమంది హృదయాలలో చోటు దక్కించుకున్నాడు. అటువంటి వ్యక్తికి ప్రస్తుతం తండ్రి లేడు. ఒకవేళ గనుక విరాట్ కోహ్లీకి ఇప్పుడు తండ్రి ఉండి ఉంటే.. అతని విజయాన్ని కనులారా వీక్షించేవాడు. ఆ ఆనందాన్ని గుండెల నిండా నింపుకునేవాడు. దురదృష్టవశాత్తు విరాట్ కోహ్లీకి తండ్రి లేడు. ఆ బాధ ఎవరూ పూడ్చలేరు. ఆ వెలితిని ఎవరూ తీర్చలేరు. బహుశా అందువల్లే విరాట్ తన పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతాడు. తన బాధను, ఆవేదనను, భారాన్ని వారి ద్వారా తగ్గించుకుంటాడని” విరాట్ కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.