https://oktelugu.com/

educational : విద్యాసంస్థలకు సీరియస్ వార్నింగ్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు అధికారులు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 23, 2024 2:32 pm
    Serious warning to educational institutions.. Government's key decision.

    Serious warning to educational institutions.. Government's key decision.

    Follow us on

    educational : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు అధికారులు. విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించింది. నిర్దేశిత ఫీజుల కంటే అధికంగా వసూలు చేయవద్దని చెప్పింది. ఇలాంటి ఫిర్యాదులు రావడంపై మండి పడింది ఏపీ ప్రభుత్వం. ఈ విషయం మీద ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ హెచ్చరించింది. ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలకు రూ.15 లక్షల జరిమానా విధించే అధికారం కమిషన్‌కు ఉందని గుర్తు చేశారు.కొన్ని విద్యా సంస్థలు కోర్సు పూర్తైనా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని.. ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొన్న ఫీజు కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని తమకు ఫిర్యాదులు వస్తున్నాయంటున్నారు.

    దీని వల్ల విద్యార్థుల చదువులు, ఉద్యోగ అవకాశాలను దెబ్బతింటాయని అలా చేయవద్దన్నారు. ఈ విధంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టే విద్యాసంస్థలకు జరిమానా, గుర్తింపు రద్దుచేసేందుకు యూనివర్శిటీకి సిఫార్సు చేసే అధికారం కమిషన్‌కు ఉందని కూడా తెలిపారు అధికారులు. ఇక యూజీసీ నిబంధనల ప్రకారం ఒరిజినల్‌ సర్టిఫికెట్లను విద్యాసంస్థలు తీసుకోవద్దని కూడా తెలిపారు. అయినా కూడా విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే ఫోన్‌ నంబర్లు 87126 27318, 08645-274445లకు ఫిర్యాదు చేయొచ్చు అన్నారు. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ తెలిపింది.

    ఇదిలా ఉంటే రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలుపై శాసనమండలిలో మంత్రి స్పందించారు. ఇకపై కాలేజీల యాజమాన్యాల బ్యాంక్ అకౌంట్‌లకే ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ చేస్తామన్నారు. ‌ గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ తల్లుల అకౌంట్‌లలో జమ చేసే విధానం తీసుకొచ్చింద గుర్తు చేశారు. కానీ వారికి ఫీజులు చెల్లించలేదని పేర్కొన్నారు. తల్లి బ్యాంక్ అకౌంట్‌లో, ఆ తర్వాత తల్లి-విద్యార్థి జాయింట్‌ అకౌంట్‌లో డబ్బులు జమ చేసే ప్రాసెస్ లో చాలా ఇబ్బందులు పడ్డారన్నారు.

    ఇకపై ఈ విధానానికి గుడ్ బై చెప్పామని తెలిపారు. అంతేకాదు గతంలో ఉన్న విధానాన్ని మళ్లీ అమలు చేస్తామని అన్నారు. విద్యార్థులకు విడతల వారీగా ఫీజుల బకాయిలు కాలేజీలకు చెల్లిస్తామని ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్రంలో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. గత ప్రభుత్వం మెస్‌ ఛార్జీలు, ట్యూషన్‌ ఫీజులు సరిగా చెల్లించలేదని పేర్కొన్నారు. కానీ ఈ సారి అలాంటి సమస్యలు లేకుండా విద్యార్థులకు న్యాయం చేస్తామన్నారు.