China’s Education System : అప్పటికప్పుడు రిపబ్లికన్ పార్టీ నాయకులు ఆ తరహా టీ షర్ట్ లు ధరించడం అమెరికాలో సంచలనంగా మారింది. అది కాస్త మీడియాలో ప్రచారం కావడంతో ఒక్కసారిగా ట్రంప్ హత్యాయత్నం ఘటన కలకలం రేపింది. వాస్తవానికి ఈ టీ షర్టులు అమెరికాలో తయారు కాలేదు. చైనాలో అప్పటికప్పుడు రూపొందించారు. ఈ టీ షర్టులు తయారయ్యాయి. వెంటనే అమెరికాకు వచ్చేశాయి. అది కూడా గంటల వ్యవధిలోనే.. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు చైనాలో తయారి వ్యవస్థ ఎంత గొప్పగా ఉందో.. ఇప్పటికీ అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, యూరప్ దేశాలు తమ ఎకనామి గురించి గొప్పగా చెప్పుకుంటాయి గానీ.. ఏదైనా ఉపద్రవం వస్తే ఎలా ఎదుర్కోవాలో తెలియదు. కానీ చైనా అలా కాదు.. ప్రపంచ తయారీ కేంద్రంగా.. ప్రపంచ కర్మకారంగా వెలు గొందుతున్న ఆ దేశం.. ఉత్పత్తి కేంద్రాలను అంతకంతకు విస్తరించుకుంటూ పోతుంది. ఆ దేశం వద్ద అత్యంత విలువైన మానవ వనరులు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా భిన్నమైన విద్యా విధానం ఉంది. అందువల్లే ఆ దేశం రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. అతి త్వరలో అమెరికాను ఢీకొట్టగలిగే స్థాయికి ఎదుగుతుంది. దీనంతటి కారణం అక్కడ విద్యావ్యవస్థ పటిష్టంగా ఉండడమే.
సమూలంగా మార్చేశారు
ఒకప్పుడు చైనాలో మార్కులకే ప్రాధాన్యం ఇచ్చేవారు. ర్యాంకులకే ప్రోత్సాహం కల్పించేవారు. కానీ అది సరైన విధానం కాదని.. దానివల్ల నాణ్యమైన విద్య విద్యార్థులకు అందడం లేదని గుర్తించి.. మార్కులు, ర్యాంకుల కొలమానాన్ని పక్కనపెట్టి వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు చదువుకునే పాఠశాలల్లో చదువుతోపాటు బట్టలు కుట్టడం, హెయిర్ కటింగ్, పిండి రుబ్బించడం, ఈత నేర్పించడం, భవన నిర్మాణంలో పాలుపంచుకునేలా చేయడం.. వ్యవసాయం చేయించడం.. పంటలు పండించడం వంటివి నేర్పిస్తున్నారు. దీనివల్ల విద్యార్థి కేవలం చదువుకు మాత్రమే కాకుండా ఇతర పనులపై కూడా ఆసక్తి కలిగించేలా చేస్తున్నారు. ఇవి పిల్లల్లో విద్యార్థి దశలోనే పనిచేసే విధంగా అడుగులు వేయిస్తాయని చైనా నమ్ముతోంది. చైనా పాఠశాలల్లో విద్యార్థులు పనిచేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి..”పనిచేయడమే మా లక్ష్యం. చిన్నప్పటినుంచే మేము ఈ విధానాన్ని విద్యార్థుల్లో అవలంబిస్తున్నాం. దానివల్ల వారికి పని చేయాలనే కోరిక పుడుతుంది. వారు చదువు పూర్తి అయిన తర్వాత ఏదో ఒక రంగంలో స్థిరపడతారు. అది అంతిమంగా దేశాభివృద్ధికి సహకరిస్తుంది. పనిచేసే వారు ఉంటే దేశం అని రంగాలలో ముందంజలో ఉంటుంది. దీనిని మేము బలంగా నమ్ముతాం. అదే విధానాన్ని అమలులో పెట్టామని” చైనా విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు.. మనదేశంలో నేటికీ విద్యా వ్యవస్థ ర్యాంకులు, మార్కుల వద్దే ఆగిపోయింది. అందువల్లే కొత్త ఆవిష్కరణలు పుట్టడం లేదు. ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ఎదగడం లేదు. చైనాలో అమలవుతున్న విద్యా విధానాన్ని చూసైనా.. దానిని భారత్ అనుసరిస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మార్కులు, ర్యాంకులు కాదు.. చైనా విద్యా విధానం విభిన్నం.. వినూత్నం.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ఇది.. ఇప్పటికైనా మన విద్యా విధానం మారుతుందా?!#China pic.twitter.com/K7qkSn7NFV
— Anabothula Bhaskar (@AnabothulaB) November 13, 2024