చాలించిన తనువు.. చితిపైనే మనువు.. ప్రేమ జంట విషాదాంతం

ప్రేమ ఓ అందమైన అనుభూతి. మధురస్వప్నం. కలిసి బతకాలని కోరుకునే జంట తమ ఊసులు పంచుకునే అద్భుత వేదిక ప్రేమ. ప్రేమ కోసం ఎందరో తమ ప్రాణాలు వదిలారు. ప్రేమను నిలబెట్టుకునే క్రమంలో ఎందరో తమ ప్రాణాలు తృణప్రాయంగా భావించారు. మేం లేకపోయినా మా ప్రేమ కలకాలం బతకాలని తమ జీవితాలనే మధ్యలో చాలించిన కథలు కోకొల్లలు. కోరుకున్న ప్రియుడి కోసం తన సర్వస్వం అర్పించే ప్రేమికురాళ్లు కూడా ఎందరో చరిత్రలో మనకు కనిపిస్తారు. నమ్ముకున్న వ్యక్తి […]

Written By: Srinivas, Updated On : August 3, 2021 2:03 pm
Follow us on

ప్రేమ ఓ అందమైన అనుభూతి. మధురస్వప్నం. కలిసి బతకాలని కోరుకునే జంట తమ ఊసులు పంచుకునే అద్భుత వేదిక ప్రేమ. ప్రేమ కోసం ఎందరో తమ ప్రాణాలు వదిలారు. ప్రేమను నిలబెట్టుకునే క్రమంలో ఎందరో తమ ప్రాణాలు తృణప్రాయంగా భావించారు. మేం లేకపోయినా మా ప్రేమ కలకాలం బతకాలని తమ జీవితాలనే మధ్యలో చాలించిన కథలు కోకొల్లలు. కోరుకున్న ప్రియుడి కోసం తన సర్వస్వం అర్పించే ప్రేమికురాళ్లు కూడా ఎందరో చరిత్రలో మనకు కనిపిస్తారు. నమ్ముకున్న వ్యక్తి కోసం తన ప్రాణం పోయినా తమ ప్రేమ నిలవాలని ఆశించే వారే ఎక్కువ. అలాంటి ప్రేమను బతికించుకోలేక అర్థంతరంగా తనువులు చాలిస్తున్న జంటలు కూడా ఉన్నాయి.

జంట చనిపోయాక కూడా ఒక్కటైన వైనం మనం ఇదివరకు చూడలేకపోయాం. కానీ విచిత్రంగా మహారాష్ర్టలోని ప్రేమికులు ఈ ఘనత సాధించారు. చనిపోయిన చితిలోనే ఏకమైన జంట ముచ్చట అందరిలో ముచ్చట గొలుపుతోంది. పెద్దలు తమ ప్రేమను అంగీకరించలేదని భావించి తమ ప్రేమను బతికించుకోలేమని ఆలోచించి తమ ప్రాణాలు తీసుకున్న జంటను చితిపై పేర్చే క్రమంలో వారికి వివాహం చేసిన అరుదైన సంఘటన మహారాష్ర్ట లోని జలగావ్ జిల్లాలో చోటుచేసుకుంది.

జ‌ల‌గావ్ జిల్లా వాడే గ్రామానికి చెందిన ముకేశ్ కైలాస్ సోనావోనా(22 పాలట్ గ్రామానికి చెందిన నేహా బాపు (19) ప్రేమించుకున్నారు. ఊసులు పంచుకున్నారు. ఆశలు పెంచుకున్నారు. భవిష్యత్తుపై బంగారు కలలు కన్నారు. జీవితంలో పెళ్లి చేసుకుని మంచి పేరు తెచ్చుకోవాలని భావించారు. కానీ వారి ఆశలు అడియాశలే అయ్యాయి. దీంతో ఇక వారు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శనివారం రాత్రి వాడే గ్రామంలోని ఓ పాఠశాలలో ముకేశ్ నేహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం ఆదివారం వెలుగుచూసింది.

పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టమ్ నిర్వహించి వారి కుటుంబసభ్యులకు అందజేశారు. శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేసేందుకు ముందు ఆ జంటకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. దీంతో చితిపైనే వారికి పెళ్లి జరిపించి దహనం చేశారు. చనిపోయిన తరువాత కూడా ఒక్కటయ్యే భాగ్యం దక్కినందుకు అందరు సంతోషించారు. వారి కోరిక ఈ విధంగానైనా నెరవేరిందని పలువురు చర్చించుకున్నారు. కానీ బతికుంటే వారి ముచ్చట ఎంత బాగుండేదో అని పలువరి వాదన.