
దేశంలో కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 30,549 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 38,887 మంది బాధితులు కోలుకోగా మరో 422 మంది మరణించారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,17,26,507కు పెరిగింది. ఇప్పటి వరకు 3,08,96,354 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,04,958 యాక్టివ్ కేసులు ఉన్నాయి.