C Voter Survey: ఏపీలో ఎన్నికల హడావుడి అప్పుడే మొదలైంది. 2024 ఎన్నికల కోసం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వ్యూహరచనలు కొనసాగుతున్నాయి. జగన్‌ను ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపుమేరకు పొత్తుల పైన అనధికారికంగా చర్చలు మొదలయ్యాయి. ఇక, జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందంటూ ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరిన జగన్‌కు మరోసారి అధికారం రాకుండా ఉండేందుకు మిగతా పార్టీలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు ఉద్యోగుల అసహనంతో పాటు అభివృద్దిని టార్గెట్ చేయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నట్టు టాక్..
Narendra Modi
సీఓటర్ – ఇండియా టూడే సర్వే ప్రకారం కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం వస్తుందని స్పష్టమైంది.ప్రస్తుతం జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను 2024 ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించనున్నారు. యూపీలో యోగి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే కేంద్రంలో మోడీ మూడోసారి ప్రధాని అవుతారని సర్వే చెబుతున్నాయి. నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ (ఎన్డీయే) సీట్ల సంఖ్య 350 నుంచి 296కు పడిపోతుందని తేల్చి చెప్పింది.
Also Read: కేంద్రంలో అధికారానికి యూపీయే మార్గం..: ఎందుకు కీలకం?
బీజేపీ ఎంపీల సంఖ్య 303 నుంచి 271 వరకు రావొచ్చని.. దీంతో సొంతంగా అధికారంలోకి వచ్చే స్థితిలోనే ఉందని తెలిపింది. ప్రధాన మోదీకి జాతీయ స్థాయిలో ఆదరణ తగ్గకపోయినా.. రాష్ట్రాలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. బీజేపీ పాలిత సీఎంలతో పాటు ఇతర రాష్ట్రాలకు సీఎంలకు కూడా ఈసారి భంగపాటు తప్పేలా లేదని తెలుస్తోంది. ఇక ఏపీ విషయానికొస్తే జగన్ – చంద్రబాబు మధ్యనే పోటీ ఉంటుందని, బీజేపీ – కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లోనూ టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని సర్వే తేల్చింది. సర్వే పైన సీనియర్ పొలిటికల్ అనలిస్టులు మాత్రం జనాదరణలో ఏపీకి జగన్‌కు తిరుగులేదంటూ విశ్లేషణలు చేశారు. ఇక, ఏపీలో త్వరలో నర్సాపురం బైపోల్ జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న సమయంలో ఈ సర్వేల కంటే… నేరుగా పబ్లిక్ పల్స్ వైసీపీ వర్సెస్ ప్రతిపక్షాలుగా సాగే ఈ ఎన్నికలో తేలి పోయే అవకాశం ఉందంటూ చర్చ మొదలైంది.