https://oktelugu.com/

Karthika Deepam: అప్పుపై కోపంతో రగిలిపోయిన వంటలక్క.. ఏకంగా డాక్టర్ బాబు ఆ మాట అనడంతో!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. పిల్లలు కాసేపు బాబుతో ఆడుతూ ఉంటారు. అంతలోనే దీప.. సౌందర్య, ఆనందరావు వాళ్ల గురించి ఆలోచనలో పడుతుంది. ఇక మోనిత కొటేష్ ఫోటోను లక్ష్మణ్ కి చూపించి అతడిని పట్టుకోమని చెబుతుంది. కానీ కోటేష్ నిరాకరించడంతో మోనిత వెంటనే తన భార్యకు వైద్యం చేసిన డబ్బులు తిరిగి ఇవ్వమని చెబుతుంది. మరోవైపు కార్తీక్ పిల్లలకు భోజనం చేపిస్తూ ఉంటాడు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 21, 2022 / 12:18 PM IST
    Follow us on

    Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. పిల్లలు కాసేపు బాబుతో ఆడుతూ ఉంటారు. అంతలోనే దీప.. సౌందర్య, ఆనందరావు వాళ్ల గురించి ఆలోచనలో పడుతుంది. ఇక మోనిత కొటేష్ ఫోటోను లక్ష్మణ్ కి చూపించి అతడిని పట్టుకోమని చెబుతుంది. కానీ కోటేష్ నిరాకరించడంతో మోనిత వెంటనే తన భార్యకు వైద్యం చేసిన డబ్బులు తిరిగి ఇవ్వమని చెబుతుంది.

    Karthika Deepam

    మరోవైపు కార్తీక్ పిల్లలకు భోజనం చేపిస్తూ ఉంటాడు. మహాలక్ష్మి ని పిలిపించి బాబును కాసేపు చూసుకోమని చెబుతాడు. ఇక దీప హోటల్ కి వెళ్లి పనిచేస్తూ ఉంటుంది. అత్తయ్య వాళ్ళు భోజనం ఆర్డర్ చేస్తే బాగుండు నా చేతితో వండి పెడతాను అని అనుకుంటుంది. ఇక రుద్రాణి తన మనిషికి బాబుని ఎత్తుకొని వచ్చేసేయమని చెబుతుంది. ఇక దీప హోటల్లో పని అయిపోవడంతో ఆలస్యమైందని ఇంటికి త్వరగా వస్తుంది.

    Also Read: రుద్రాణికి షాకింగ్ వార్నింగ్ ఇచ్చిన డాక్టర్ బాబు.. ప్రమాదం నుంచి బయటపడ్డ కార్తీక్!

    తాను ఏదో వస్తువు మర్చిపోవటం తో వెనకాల నుంచి అప్పారావు పరిగెత్తుకుంటూ వచ్చి తన వస్తువు ఇస్తాడు. తిరిగి వెళ్ళిపోకుండా దీప తో కాసేపు నడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక బావ ఏం చేస్తాడని అనటంతో దీప సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. ఇక మాటల్లో అప్పు.. బావ కూడా మనతో పాటు పని చేస్తే బాగుండు అనే సరికి.. దీప కోపంతో రగిలిపోయి అరుస్తుంది.

    వెంటనే అప్పు సారీ చెబుతాడు. సౌందర్య వాళ్ళు కాసేపు బయట వాతావరణాన్ని గడపడానికి కారులో బయలుదేరుతారు. ఇక దారిలో టీ తాగటానికి కార్తీక్ పనిచేసే హోటల్ కి వెళ్తారు. అక్కడ అప్పు వారితో కాసేపు సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. కార్తీక్ టీ తయారు చేస్తూ దీప దగ్గర టీ నేర్చుకున్నందుకు ఇప్పుడు ఉపయోగపడుతుందని అనుకుంటాడు. ఇక టీ ఇవ్వడానికి వెళ్లేటప్పుడు సౌందర్య, ఆనందరావు వాళ్లను చూసి కార్తీక్ ఒకేసారి షాక్ అవుతాడు.

    Also Read: రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్లు ఇవే !