https://oktelugu.com/

RRR: రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్లు ఇవే !

RRR: కరోనా మూడో వేవ్ దెబ్బకు మళ్ళీ భారీ సినిమాలు వాయిదా పడ్డాయి. ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ‘రాధేశ్యామ్’ కూడా పోస్ట్ ఫోన్ అయింది. అయితే, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాల కొత్త విడుదల తేదీలపై టాలీవుడ్‌లో కొత్త ప్రచారం మొదలైంది. దర్శక దిగ్గజం రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ సినిమాను ఏప్రిల్ 29న లేదా జూన్ 3న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ రిలీజ్ డేట్స్ పై జక్కన్న బయ్యర్లతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ పాన్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 21, 2022 / 11:09 AM IST

    RadheShyam New Poster

    Follow us on

    RRR: కరోనా మూడో వేవ్ దెబ్బకు మళ్ళీ భారీ సినిమాలు వాయిదా పడ్డాయి. ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ‘రాధేశ్యామ్’ కూడా పోస్ట్ ఫోన్ అయింది. అయితే, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాల కొత్త విడుదల తేదీలపై టాలీవుడ్‌లో కొత్త ప్రచారం మొదలైంది. దర్శక దిగ్గజం రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ సినిమాను ఏప్రిల్ 29న లేదా జూన్ 3న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ రిలీజ్ డేట్స్ పై జక్కన్న బయ్యర్లతో మాట్లాడినట్లు తెలుస్తోంది.

    RRR

    ఇక ప్రభాస్ పాన్ ఇండియా మూవీని మార్చి 18న విడుదల చేయాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నారు. ఇందులో నిజం ఎంతుందో తెలియదు గానీ, ప్రభాస్ ఫ్యాన్స్ గ్రూప్స్ లో కూడా ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. ప్రభాస్ కూడా ఈ రిలీజ్ డేట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరి ఈ వార్త పై
    చిత్రయూనిట్‌ ఎలా స్పందిస్తోందో చూడాలి. నిజానికి ‘రాధేశ్యామ్’ మేకర్స్ మాత్రం తాము ముందు ప్రకటించిన విధంగానే తమ సినిమాను జనవరి 14వ తేదీనే రిలీజ్ చేస్తామని చెబుతూ వచ్చారు.

    Also Read: ట్రెండింగ్ న్యూస్.. ఏడాదిలో 3 వేల కోట్ల అప్పు తీర్చిన మహిళ..!

    కానీ కరోనా మూడో వేవ్ దెబ్బకు సినిమాని పోస్ట్ ఫోన్ చేయక తప్పలేదు. ఏది ఏమైనా బయ్యర్లలో మాత్రం రోజురోజుకు టెన్షన్ పెరుగుతూ ఉంది. ఒకవేళ అప్పుడు కూడా కోవిడ్ కేసులు మరింతగా పెరిగితే ఏమిటి పరిస్థితి ? అసలుకే ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ పై సీరియస్ గా ఉంది. అయితే మూడో వేవ్ రెండు నెలలు మాత్రమే ఉంటుందని అంచనా ఉంది. కాబట్టి ఈ రెండు భారీ సినిమాల కొత్త రిలీజ్ డేట్లకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.

    Also Read: కేంద్రంలో అధికారానికి యూపీయే మార్గం..: ఎందుకు కీలకం?

    Tags