https://oktelugu.com/

ఏపీ సీఐడీపై సుప్రీంకోర్టుకు ఆ రెండు న్యూస్ చానళ్లు

ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టుతో రాజకీయాలు మారిపోయాయి. సీఐడీ అధికారులు తమపై నమోదు చేసిన రాజద్రోహం కేసులు కుట్ర పూరితమని తక్షణమే ఆ ఉత్తర్వులు నిలిపివేయాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండు టీవీ చానళ్లపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసిందని పేర్కొన్నాయి. పత్రికల హుందాతనాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన ప్రభుత్వంపై తమ అక్కసు వెళ్లగక్కాయి. ప్రజాస్వామ్యంలో ఎవరు మాట్లాడినా ప్రసారం చేసే హక్కు చానళ్లకు ఉందని తెలిపాయి. ఇందులో భాగంగానే రఘురామ మాటలను […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 17, 2021 / 07:18 PM IST
    Follow us on


    ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టుతో రాజకీయాలు మారిపోయాయి. సీఐడీ అధికారులు తమపై నమోదు చేసిన రాజద్రోహం కేసులు కుట్ర పూరితమని తక్షణమే ఆ ఉత్తర్వులు నిలిపివేయాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండు టీవీ చానళ్లపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేసిందని పేర్కొన్నాయి. పత్రికల హుందాతనాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన ప్రభుత్వంపై తమ అక్కసు వెళ్లగక్కాయి. ప్రజాస్వామ్యంలో ఎవరు మాట్లాడినా ప్రసారం చేసే హక్కు చానళ్లకు ఉందని తెలిపాయి. ఇందులో భాగంగానే రఘురామ మాటలను ప్రసారం చేశామని చెప్పాయి.

    సోషల్ మీడియాలో బెదిరంపులు
    ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 చానళ్ల యాజమాన్యాలపై, ఉద్యోగుల్ని అరెస్టు చేస్తారని సోషల్ మీడియాలో బ్లాక్ మెయిల్ తరహా బెదిరింపులు వస్తున్నాయి. రఘురామ కృష్ణం రాజు మాట్లాడితే ప్రసారం చేశామని చానళ్లు మొత్తుకుంటున్నా సీఐడీ అధికారులు మాత్రం వారిపై కుట్ర పూరితంగా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. చానళ్లు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.

    పత్రికల స్వేచ్ఛ హరీ
    ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలకు స్వేచ్ఛ ఉండాలి. కానీ ఏపీలో మాత్రం పత్రికలస్వేచ్ఛ దక్కడం లేదు. నేతల మాటలు ప్రసారం చేసిన పాపానికి చానళ్లపై కేసులుపెట్టడం ఏమిటని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానళ్లు సీఐడీ పెట్టిన కేసులు అక్రమమని పేర్కొన్నాయి. పత్రికల స్వేచ్ఛ కాపాడేలా సుప్రీం కోర్టు తీర్పు ఉండాలని కోరాయి.

    మీడియా గొంతు నొక్కే..
    మీడియా గొంతు నొక్కే విధంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రభుత్వం తమకు అనుకూలంగా లేని చానళ్లపై కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కేసుల వరకు వెళ్లడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ఎవరి మాటలను వక్రీకరించి రాయలేదని, చూపలేదని చానళ్లు స్పష్టం చేస్తున్నాయి. ఆయన మాట్లాడిన మాటలు యథాతదంగా ప్రసారం చేస్తే అందులో తప్పేముందని ప్రకటించాయి. అయినా ప్రభుత్వం ఏదో కుట్ర పెట్టుకుని తమపై దుష్ర్పచారం చేస్తుందని విచారం వ్యక్తం చేస్తున్నాయి.