Manmohan Singh Birthday: దేశ ప్రధానిగా తెలుగు వ్యక్తి పీవీ.నర్సింహారావు ఉన్న సమయంలో భారత ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా వ్యవహరించిన ఆర్థికవేత్త డాక్టర మన్‌మోహన్‌సింగ్. ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు. తర్వాత 1991లో తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. 2005 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేశారు. మచ్చలేని నాయకుడిగా, ఆర్థిక వేత్తగా, ఆర్బీఐ గవర్నర్‌గా గుర్తింపు పొందారు. గురువారం(సెప్టెంబర్ 26న) పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘మాజీ ప్రధాని డాక్టర్ మన్‌మోహన్‌సింగ్‌జీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నా’ అని మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ నేతలు కూడా..
ఇక కాంగ్రెస్ నేతగా, కాంగ్రెస్ నుంచి ప్రధానిగా పనిచేసిన మన్‌మోహన్‌సింగ్‌కు ఆ పార్టీనేతలు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కూడా‘డాక్టర్ మన్మోహన్ సింగ్ జీకి జన్మదిన శుభాకాంక్షలు. మన దేశ భవిష్యత్తును రూపొందించడంలో మీ వినయం, జ్ఞానం, నిస్వార్థ సేవ నాకు, మిలియన్ల మంది భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. మీకు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, ఆనందాన్ని కోరుకుంటున్నాను!’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
1932లో జన్మించిన సింగ్..
మన్‌మోహన్‌సింగ్ 1932, సెప్టెంబర్ 26న ప్రనస్తుత పాకిస్తాన్‌లోని పశ్చిమ పంజాబ్‌లోని గాహ్‌లో జన్మించారు. చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్ సంపాదించాడు. భారత ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా ప్రారంభించిన సింగ్, ఆర్‌బీఐకి నాయకత్వం వహించాడు. 1991లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన 1999లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
2004 నుంచి ప్రధానిగా…
2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు, అప్పటి సంకీర్ణ అధినేత్రి సోనియా గాంధీ ప్రధానిగా నియమించారు. 2014 వరకు సంకీర్ణ ప్రభుత్వాని నాయకత్వం వహించారు.