https://oktelugu.com/

Top 5 Telugu Movies: గత 10 సంవత్సరాల్లో వచ్చిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే…

సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేయాలని తద్వారా సినిమాలో తను కూడా ఒక మెంబర్ అవ్వాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దానికి తగ్గ హార్డ్ వర్క్ మాత్రం కొందరే చేస్తూ ఉంటారు. వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టార్లు గా ముందుకు దూసుకెళ్తూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 26, 2024 / 01:25 PM IST

    Top 5 Telugu Movies

    Follow us on

    Top 5 Telugu Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం పాన్ ఇండియాలో టాప్ ఇండస్ట్రీ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం మనకు తెలిసిందే… ప్రస్తుతం మన స్టార్ హీరోలందరు వరుస సినిమాను చూస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉంటే గత 10 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన టాప్ 5 సినిమాలేంటో మనం ఒకసారి తెలుసుకుందాం…

    1. బాహుబలి సిరీస్

    రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి సినిమా మొదటి పాన్ ఇండియా సినిమాగా రావడమే కాకుండా ఇండియన్ ఇండస్ట్రీలో ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ రెండు సినిమాలు కలిపి దాదాపు 2600 కోట్ల వరకు కలెక్షనా ను రాబట్టాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గా అవతరించిందనే చెప్పాలి. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ వరుసగా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ మన దర్శకులకు అలాగే హీరోలకు భారీ మార్కెట్ ను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు…

    2. రంగస్థలం

    సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా భారీ సక్సెస్ ను అందుకోవడమే కాకుండా రామ్ చరణ్ కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ హెట్ గా కూడా మిగిలింది. అలాగే నటన పరంగా కూడా ఆయనలో దాగి ఉన్న పూర్తిస్థాయి నటుడిని ఈ సినిమా బయటికి తీసిందనే చెప్పాలి.

    3.కల్కి
    ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా మన పురాణాలను బేస్ చేసుకొని తీశారు. అయితే ఈ సినిమాని చూసిన ప్రేక్షకుడు ఎంజాయ్ చేయడమే కాకుండా చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి కథతో ఒక బెస్ట్ సినిమా వచ్చింది అంటూ విమర్శకులు సైతం నాగ్ అశ్విన్ మీద పొగడ్తల వర్షం కురిపించారు. ఇక ప్రస్తుతం కల్కి సినిమాకి సీక్వెల్ గా కల్కి 2 సినిమా కూడా వస్తుంది…

    4. త్రిబుల్ ఆర్
    జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన ఈ సినిమా సక్సెస్ ని సాధించడమే కాకుండా పాన్ ఇండియా ఇండస్ట్రీలో రాజమౌళికి మరింత మార్కెట్ ఏర్పడింది…ఇక మొత్తానికైతే ఇద్దరు హీరోలు కలిసి చేసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం అనేది ఇద్దరు హీరోల అభిమానులకు ఆనందాన్ని కలిగించిందనే చెప్పాలి…

    5. హనుమాన్

    ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హనుమాన్ ‘ సినిమా సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సినిమా మీద మొదట్లో పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ సినిమా రిలీజ్ సమయంలో మాత్రం భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ రావడమే కాకుండా ఒక పెను ప్రభంజనాన్ని కూడా సృష్టించింది…