Surya: సూర్య కెరియర్ లో వచ్చిన టాప్ 3 మూవీస్ ఇవేనా..?

తమిళ్ ఇండస్ట్రీ లో మంచి హీరో గా పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటి వాళ్లలో సూర్య ఒకరు. ఆయన రోజు రోజుకి తన మార్కెట్ ను విస్తరించుకుంటున్నాడు...

Written By: Gopi, Updated On : September 26, 2024 1:32 pm

Surya

Follow us on

Surya: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్, తర్వాత మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో సూర్య…ప్రస్తుతం ఆయన చేస్తున్న కంగువ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఇలాంటి సందర్భంలో ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక సూర్య మాత్రం భారీ సక్సెస్ ను అందుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఇదిలా ఉంటే సూర్య ఎంటైర్ కెరియర్ లో చాలా సినిమాలు చేశాడు. అయితే ఆయన చేసిన సినిమాల్లో ఒక మూడు సినిమాలు మాత్రమే ఆయనకు విపరీతంగా గుర్తింపు ను తీసుకురావడమే కాకుండా ఆయనలోని నటనను బయటకి తీసాయనే చెప్పాలి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి అంటే…

గజిని
మురుగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన గజినీ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా సూర్యకి ఓవర్ నైట్ లో స్టార్ హీరో అనే గుర్తింపు కూడా వచ్చింది. ఇక తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకొని అటు తమిళ్, ఇటు తెలుగు రెండు భాషల్లో కూడా తన మార్కెట్ ను విస్తరించుకుంటూ వస్తున్నాడు…

సూర్య సన్నాఫ్ కృష్ణన్

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమా సూర్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పాలి. ఈ సినిమా కోసం ఆయన విపరీతంగా కష్టపడ్డాడని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మరి మొత్తానికైతే ఆయన లాంటి హీరో సినిమా ఇండస్ట్రీలో తీవ్రమైన కష్టాన్ని భరిస్తూ కూడా ఆ సినిమాను సక్సెస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక సినిమా కోసం ఎంత రిస్క్ అయిన చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని సూర్య కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పడం విశేషం…

జై భీమ్

ఇక జై భీమ్ సినిమాతో పాన్ ఇండియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్న సూర్య ఈ సినిమాలో లాయర్ గా నటించి పేద వాళ్ళ హక్కులను వాళ్ళు ఎలా పరిరక్షించుకోవాలి అనేది కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. సూర్య నటించిన సినిమాలన్నిటిలో ఈ సినిమా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా కథ పరంగా కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాంటి పాత్రని చాలెంజింగ్ గా తీసుకొని సూర్య తనదైన రీతిలో నటించి మెప్పిస్తాడు. ఇక అలాంటి ఒక హుందాతనాన్ని కలిగి ఉండి ఒక కేసు విషయంలో ఒక సిన్సియర్ లాయర్ ఎలా ముందుకు సాగుతాడు అనేది కూడా సూర్య మన కండ్లకు కట్టినట్టుగా చూపించారు. మరి మొత్తానికైతే ఈ సినిమా ద్వారా సూర్య ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు…