ఏడాదిపాటు మ్యాగి తిని బతికిన అతడే.. నేడు స్టార్‌‌ క్రికెటర్‌‌

1993 అక్టోబరు 11న హార్దిక్ పాండ్యా జన్మించాడు. బరోడా క్రికెట్ టీంకు చెందిన భారత ఆటగాడు . రైట్‌ హ్యాండ్‌ ప్లేయర్‌‌. పాండ్యాలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. అతని మీద అతనికి ఎంతో నమ్మకం. ఒకప్పుడు 99వ తరగతి ఫెయిల్‌ అయిన కుర్రాడు ఇప్పుడు భారత క్రికెట్‌ ప్లేయర్‌‌. భారత క్రికెట్‌ చరిత్రలో ఎన్నో ఘనతలు సాధిస్తున్న ధీరుడు. బంగ్లాతో ఫైనల్ ఓవర్ వేసి భారత్‌ను గెలిపించిన యువకిశోరం. 2016 టీ-20 ప్రపంచ్ కప్‌లో భారత్ బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. […]

Written By: Srinivas, Updated On : February 17, 2021 10:37 am
Follow us on


1993 అక్టోబరు 11న హార్దిక్ పాండ్యా జన్మించాడు. బరోడా క్రికెట్ టీంకు చెందిన భారత ఆటగాడు . రైట్‌ హ్యాండ్‌ ప్లేయర్‌‌. పాండ్యాలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. అతని మీద అతనికి ఎంతో నమ్మకం. ఒకప్పుడు 99వ తరగతి ఫెయిల్‌ అయిన కుర్రాడు ఇప్పుడు భారత క్రికెట్‌ ప్లేయర్‌‌. భారత క్రికెట్‌ చరిత్రలో ఎన్నో ఘనతలు సాధిస్తున్న ధీరుడు. బంగ్లాతో ఫైనల్ ఓవర్ వేసి భారత్‌ను గెలిపించిన యువకిశోరం.

2016 టీ-20 ప్రపంచ్ కప్‌లో భారత్ బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ఆ టైమ్‌లో అందరూ భారత్ గెలుపు మీద ఆశలు వదిలేసుకొన్నారు. భారత్ ప్రజల ఆశలను తన భుజాన మోస్తున్నాడు. బౌలింగ్ చేస్తున్న వ్యక్తి లాస్ట్ ఓవర్‌‌లో మూడు బాల్స్‌కు ఇక రెండు పరుగులు చేస్తే బంగ్లాదేశ్ గెలుపు.. ఇక అభిమానులు గెలుపుపై ఆశలు వదిలేసుకొన్న సమయంలో ఓవర్‌‌లో నాలుగో బాల్ వికెట్, ఐదో బాల్ వికెట్ ఇక లాస్ట్ బాల్‌కు రెండు పరుగులు కెప్టెన్ సూచనని తూచా తప్పకుండా బాల్ వేసి భారత్ ను గెలుపు ముంగిట సగర్వంగా నిలబెట్టిన హార్ధిక్ పాండ్యా.. ఇప్పుడు చాలా ఫేమస్ క్రికెటర్. కానీ.. అతను పుడుతూనే గోల్డెన్ స్పూన్ ను నోట్లో పెట్టుకొని పుట్టలేదు.. తినడానికి తిండి లేదు.. సరైన వసతి లేదు.. కానీ క్రికెట్ అంటే ప్రాణం. దానికోసం ఎంతో కష్ట పడ్డాడు. చివరకు తాను అనుకున్నది సాధించాడు. ఈ తరానికి ఆదర్శ యువకుడిగా నిలబడ్డాడు.

Also Read: చెన్నైలో ఇంగ్లండ్ చిత్తు.. ఇండియా గెలుపులో ట్విస్ట్ ఇదే..

హార్దిక్‌ పాండ్యాది చాలా నిరుపేద కుటుంబం. 9వ తరగతి ఫెయిల్‌ అయ్యాడు. తినడానికి తిండి కూడా లేని రోజులు కూడా గడిపాడు. ఒక సంవత్సరం ఐదు రూపాయల మ్యాగీతోనే కడుపు నింపుకున్నాడు. కానీ.. ఇంగ్లిష్ పై మంచి పట్టు సాధించాడు. ఎందుకు ఇంగ్లిష్‌ను ఇంత పట్టుదలగా నేర్చుకుంటున్నవంటే రేపు నేను గొప్పవాడిని అయ్యాక ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలి కదా అని అంటాడు. చెప్పడమే కాదు తనకిష్టమైన క్రికెట్ లో గొప్పవాడు కావడం కోసం ఎన్నింటినో వదులుకున్నాడు. చివరకు సాధించాడు. కుటుంబాన్ని పోషించడం కోసం క్రికెట్ ఆడిన హార్ధిక్ ఇప్పుడు ఇండియా క్రికెట్ టీంలో చోటు సంపాదించే వరకూ చేసిన జర్నీ ప్రతి యువకుడికి ఆదర్శం.

హార్ధిక్ ఆటను చూసిన సచిన్ ‘నీవు ఇండియా కోసం ఏడాది లోపులో ఆడతావు’ అని అన్నాడు. కానీ.. ఏడాది కాకుండానే ఇండియా క్రికెట్ సభ్యుడిగా చోటు సంపాదించుకున్నాడు. ఐపీఎల్‌లో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 61 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అందుకొన్నాడు. ఈ సందర్భంలో హార్ధిక్ మాట్లాడుతూ.. ‘నా జీవితంలో నేను చూసిన పెద్ద మొత్తం ముంబై ఇండియన్స్ నన్ను కొనుగోలు చేసి ఇచ్చిన పది లక్షల చెక్కు. ఈ ఒక్క చెక్కుతో మా కుటుంబానికి ఉన్న అప్పులన్నీ తీరిపోయాయి’ అని చెప్పాడు.

Also Read: ఆడలేక.. పిచ్‌పై విమర్శలు : ఇంగ్లండ్‌ ప్లేయర్ల వితండ వాదన

ప్రస్తుతం కీలక ఆల్ రౌండర్‌‌గా ఎదిగన హార్ధిక పాండ్యా మెరుపులాంటి ఫీల్డింగ్, పొదుపు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయడంలోనూ దిట్ట. దీంతో భారత్ కు ఆల్ రౌండర్ గా హార్ధిక్ పాండ్యా ఫేవరెట్ ప్లేయర్. బంగ్లాదేశ్‌తో హార్ధిక్ వేసిన లాస్ట్ ఓవర్ ప్రపంచానికి అతనిని పరిచయం చేసింది. సెర్బియా నటి, మోడల్‌ అయిన నటాషాతో పాండ్యా డేటింగ్ అనంతరం గతేడాది పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు గతేడాది మేలో ముద్దుల కొడుకు పుట్టాడు. అగస్త్య పేరు పెట్టారు. ఇక 2021 జనవరి 16న హార్దిక్‌ తండ్రి హిమాన్షు పాండ్యా గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఇండియా ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు ఎంపికైన పాండ్యా బరిలోకి దిగే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు.