Crime News : విధిరాత చాలా బలీయమైంది. దానిని ఎవరూ మార్చలేరు. టెక్నాలజీ పెరిగినా.. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినా.. వ్యాధులను నయం చేసే మందులు ఎన్నో తయారవుతున్నా.. మృత్యువును మాత్రం ఆపలేం. అదే విధి. ఈ విధిరాత ముందు రాజైనా బంటైనా ఒక్కటే. తాజాగా విధిరాత ప్రేమ మంధాన్ని విడదీసింది. ఆనందంగా సాగిపోతున్న కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో కాటేసింది. ఈ విషాద ఘటన ఆంద్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం బందపురంలో జరిగింది. ప్రమాదంలో మృతిచెందినవారి మృతి వెనుక కథ అందరి మనసును కదిలిస్తోంది. తల్లి, భార్య, పిల్ల చనిపోయారని విషయం తెలియక వాళ్లను ఎప్పుడూ చూస్తానో అనే ఆత్రుతతో ఆసుపత్రి మంచంపై తల్లడిల్లుతున్నాడు సుభాష్‌గౌడ్ .
రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని..
మంగళవారం రెండు కార్లు ఢీకొని 19 నెలల చిన్నారితో సహా ముగ్గురు మృతిచెందారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, భార్య, కూతురు చనిపోవడం ఆ విషయం తెలియక సుభాష్‌గౌడ్ గాయపడ్డాడు. ప్రమాద ఘటనలో దృశ్యాలను చూసి పోలీసులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. కొట్టుమిట్టాడుతున్న 19 నెలల చిన్నారి గణిష్కా కోసం అందరి మనస్సులు ఎదురుచూశాయి. చిన్నారిని కూన రామ్ గోపాల్, షేక్ సలీం ద్విచక్రవాహనంపై హుటాహుటిన దేవరపల్లి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిన్నారిలో చలనం లేకపోవడంతో నోటి ద్వారా శ్వాసను అందించి ప్రాణం పోశారు. తలకు బలమైన గాయం అవ్వడంతో వైద్యులు ఎంత ప్రయత్నించి చిన్నారిని 30 నిమిషాలు మాత్రమే కాపాడగలిగారు.
ప్రేమ.. పెద్దలను ఒప్పించి పెళ్లి..
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం బీహెచ్‌ఐఎల్ మాక్ సొసైటీకి చెందిన ఈడిగ సుభాష్‌గౌడ్ కొత్త ఇళ్లకు ఇంటీరియర్ పనులు చేయిస్తుంటాడు. ఇతనితోపాటు తల్లి, చెల్లి, తమ్ముడు ఉన్నారు. చెల్లికి పదేళ్ల కిందటే పెళ్లి చేశారు. తమ్ముడు ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రంలో ఉన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన దివ్యప్రియతో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి 2020 జూన్‌లో వివాహం చేసుకున్నారు. 2021లో వీరికి గణిష్కా జన్మించింది.
నూతన సంవత్సం కోసం..
నూతన సంవత్సరం సందర్భంగా సుభాష్ గౌడ్, తన భార్య దివ్యప్రియ(25), కుమార్తె గణిష్కా(19నెలలు), తల్లి రమాదేవి(50), చెల్లి స్వప్న, బావ మల్లిఖార్జున, మేనల్లుడు వికాశ్సాయితో అత్తగారి ఇంటికి గత నెల 30న బయలుదేరారు. గాజువాక వెళ్లాక దివ్యప్రియకు వైద్య పరీక్షలు చేయించగా రెండో నెల గర్భిణి అని తెలిసింది. తిరిగి 2న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బయలుదేరారు. కారులో ముందు సీట్లో భార్య, కుమార్తె ఉన్నారు. మధ్యలో తల్లి, చెల్లి, వెనుక బావ, మేనల్లుడు ఉన్నారు. ఊహించని కారు ఎదురుగా వేగంగా రావడంతో వీరి కారు కంట్రోల్ కాలేదు. ఈ ఘటనలో సుభాష్‌గౌడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దేవరపల్లి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం అందించారు. స్పృహలోకి వచ్చిన సుభాష్ నా భార్య, కుమార్తె, తల్లికి ఏమయ్యిందని అడుగుతుంటే వారు ఇక లేరని చెప్పలేక పోతున్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More