Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ నటిగా రాణించాలి అనుకుంటుంది. అనసూయకు ఎక్కువగా క్యారెక్టర్ రోల్స్ వస్తున్నాయి. అయితే గ్లామరస్ రోల్స్ చేయడానికి కూడా ఆమె సిద్ధం. ఆమెకున్న ఇమేజ్ రీత్యా గ్లామర్ రోల్స్ సెట్ అవుతాయి కూడా. అలాగే లీడ్ రోల్స్ చేయాలని కూడా ఆశపడుతున్నారు. ఇప్పటికే అనసూయ కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించారు. మరి లీడ్ రోల్స్ రావాలంటే స్లిమ్ అండ్ ఫిట్ గా ఉండాలి.
అనసూయ నాజూగ్గా తయారయ్యే ఛాన్స్ లేదు. సహజంగానే ఆమె కొంచెం బొద్దుగా ఉంటారు. అందులోనూ తల్లి అయ్యారు. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు అనసూయ బొద్దుగా ఉన్నా హాట్ గానే ఉంటారు. అయితే ఇంకొంచెం బరువు పెరిగినా షేప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే అనసూయ డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఆమె శాకాహారి అని సమాచారం.
అలాగే డైలీ వ్యాయామం చేస్తారు. జిమ్ కి వెళ్లి ఎక్సర్సైజులు చేయడం అనసూయ దినచర్యలో భాగంగా ఉంది. రోజూ భర్తతో కలిసి జిమ్ కి వెళుతుంది. ఇద్దరూ కలిసి వ్యాయామం చేస్తూ శ్రమ మర్చిపోతూ ఉంటారు. తాజాగా అనసూయ జిమ్ ఫిట్ లో ఉన్న ఫోటో షేర్ చేసింది. సదరు ఫోటోలో భర్త సుశాంక్ తో పాటు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ ఫోటో వైరల్ గా మారింది.
యాంకరింగ్ కి గుడ్ బై చెప్పిన అనసూయ నటనకు పరిమితం అయ్యింది. ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఈ ఏడాది పలు చిత్రాల్లో కీలక రోల్స్ చేసింది. అనసూయ విలక్షణ పాత్రలు చేస్తూ అభిమానులను పెంచుకుంటుంది. అనసూయ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ పుష్ప 2. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. పుష్ప 2లో అనసూయ లేడీ విలన్ రోల్ చేస్తున్నారు.