Boyapati Srinu On NTR: తెలుగు లో వరుసగా మూడు సినిమాలతో హిట్లు కొట్టి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. ఈయన చేసిన భద్ర, తులసి, సింహ లాంటి మూడు సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన దమ్ము సినిమా మాత్రం ప్లాప్ అయింది.
దానికి కారణం ఏంటి అనేది ఎవరికి తెలియదు కానీ ముఖ్యంగా స్క్రిప్ట్ లోనే కొంతవరకు ఫాల్ట్ ఉందని చాలా మంది చెబుతుంటారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ కి బోయపాటికి మధ్య మాటలు లేవని చాలా మంది చెప్తున్నారు దానికి కారణం ఏంటి అంటే ఎన్టీయార్ కి చెప్పిన కథ అజ్ ఇట్ ఈజ్ గా తీయకుండా ఆ స్టోరీలో కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమాని తెరకెక్కించాడని అందువల్లే ఆ సినిమా ఫ్లాప్ అయిందని చాలా మంది అంటుంటారు. అయితే ముందు ఎన్టీఆర్ కి చెప్పిన కథ బాగుంది అని ఎన్టీయార్ చెప్పాక దాంట్లో ఎన్టీఆర్ కి తెలియకుండానే కొన్ని మార్పులు చేశాడు ఆ విషయం ఎన్టీయార్ కి కూడా చెప్పలేదు దాంతో కోపానికి వచ్చిన ఎన్టీయార్ అతనితో మాట్లాడటం లేదు.
ఇక ఈ సినిమా ఎన్టీఆర్ అప్పుడున్న పరిస్థితిలో మరో ఫ్లాప్ గా మిగిలిందనే చెప్పాలి. ఇక అప్పటికే డిప్రెషన్ లో ఉన్న ఎన్టీఆర్ బోయపాటి మీద కోపంగా ఉండి బోయపాటి మీద అరిచినట్టుగా కూడా కొన్ని కథనాలు వెలుపడ్డాయి అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగడానికి కారణం మాత్రం చెప్పిన స్క్రిప్ట్ కాకుండా మధ్యలో కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమా తీయడమే అని చాలామంది చెబుతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీయార్ కొరటాల శివ డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తుంటే,బోయపాటి మాత్రం రీసెంట్ గా రామ్ తో స్కంద మూవీ చేసి ఒక భారీ ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఇప్పుడు ఆయన బాలయ్య తో మరో సినిమా చేస్తున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం నిజంగా బోయపాటి బాలయ్య కాంబో కి మరోసారి సెల్యూట్ చేయక తప్పదు.ఇక ఇప్పటికే వీళ్ళ కాంబో లో 3 సినిమాలు వచ్చి సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి…ఇక ఇది 4 వ సినిమా గా వస్తుంది.ఇది ఎన్ని రికార్డ్ లు క్రియేట్ చేస్తుందో చూడాలి….