7000 Rupees Plane: రామర్ పిళ్లై.. ఈ పేరు 90వ దశకంలో ఉన్నవారు వినే ఉంటారు. తమిళనాడుకు చెందిన రామర్‌పిళ్లై.. 1990వ దశకంలోనే నీటితో పెట్రోల్ తయారు చేసే టెక్నాలజీని కనిపెట్టారు. ఈ ఫార్ములాను ఆయన అందరి ముందు ప్రదర్శించారు. నీటితో తయారు చేసిన పెట్రోల్‌ను మండించారు. కానీ, నాటి పాలకులు ఆయన తెలివిని తొక్కేశాయి…
Also Read: పని చేయని ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు తొలగించ కూడదు.. వారికి రాజ్యాంగం కల్పించిన రక్షణ అంత బలమైనాదా?
కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ నాటు వైద్యుడు చరిపోయే వారిని కూడా బతికించే మందు తయారు చేశారు. సెకండ్ వేవ్‌లో యువకులు చనిపోతుండడం, వెంటిలేషన్ అవసరం బాగా పెరిగింది. అలాంటి సమయంలో ఈ నాటు మందు బాగా ప్రాచుర్యం పొందింది. ఈ సమయంలో మెడికల్ మాఫియా అవసరమైన మందులను బ్లాక్ చేసి లక్షలు దండుకుంది. నాటు మందును మాత్రం బయటకు రానివ్వలేదు. తొక్కేశారు..
ఇవి రెండు ఘటనలే కాదు.. భారత ఆవిష్కరించిన అనేక ఉపయోగకరమైన ఆవిష్కరణలు వెలుగులోకి రాలేదు. ఇందుకు కారణం మాఫియా. ఇలాంటి పరిస్థితులు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన యువకుడు అవనీష్ కుమార్, ఎలాంటి శిక్షణ లేకుండా స్క్రాప్ మెటీరియల్‌తో వారం రోజుల్లో ఒక ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్‌ను కేవలం రూ.7 వేల రూపాయలతో తయారు చేసి సంచలనం సృష్టించాడు. ఈ వినూత్న ఆవిష్కరణ గ్రామీణ భారతదేశంలోని యువతలోని సృజనాత్మకత, దృఢసంకల్పం, ఆవిష్కరణ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది.
సృజనాత్మక ఆవిష్కరణ..
ముజఫర్‌పూర్‌కు చెందిన ఒక సాధారణ యువకుడు అవనీష్ కుమార్. ఇతనికి ఎలాంటి శాస్త్రీయ పరిజ్ఞానం లేదు. లేబొరేటరీల గురించి తెలియదు. ఇంజినీరింగ్ చదువుకోలేదు. కేవలం తన ఊహాశక్తి ఉపయోగించి ఫ్లయింగ్ మోడల్‌ను రూపొందించాడు. అతని ప్రాజెక్ట్ కేవలం ఒక విమానం నిర్మాణం మాత్రమే కాదు, ఇది గ్రామీణ యువత అపారమైన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. వ్యర్థ పదార్థాలను ఉపయోగించి, అతను 300 అడుగుల ఎత్తు వరకు ఎగరగలిగే ఒక నమూనాను సృష్టించాడు, ఇది అతని సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మక ఆలోచనను చాటిచెబుతుంది.
ఖర్చు చేసింది రూ.7 వేలే..
ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయడానికి లక్షల రూపాయలు ఖర్చవుతాయి. కానీ, అవనీష్ ఈ ఎయిర్ క్రాఫ్ట్‌ను తయారు చేయడానికి చేసిన ఖర్చు కేవలం రూ.7 వేలు మాత్రం బిహార్ అంటేనే నిరక్షరాస్యత ఎక్కువ. అలాంటి రాష్ట్రానికి చెందిన మనీష్ మెదడులో మెదిలిన ఊహను ఇలా ఆవిష్కరించారు. ఇందుకు అతను ఉపయోగించిన స్క్రాప్ మెటీరియల్, ఇతర పరికరాలకు కేవలం రూ.7 వేలు అయింది. తక్కువ బడ్జెట్‌తో అవనీష్ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం ఆర్థిక సమస్యలు ఆవిష్కరణకు అడ్డంకి కాదని నిరూపిస్తుంది.
Also Read: ఆత్మనిర్భర్ భారత్.. ఇక సొంత యుద్ధ విమానాల తయారీ!
పరీక్షలు అవసరం..
అవనీష్ ఎయిర్ క్రాఫ్ట్ తెలివి తేటలను అందరూ అభినందించాలి. అయితే అతను తయారు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ ప్రైస్తుతం మోడల్ మాత్రమే. వాణిజ్య లేదా మానవ రవాణా కోసం ఉపయోగపడదు. అవనీష్‌కు సాంకేతిక పరమైన నాలెడ్జ్ తక్కువగా ఉన్నందున దీనిని అనేక దశల్లో ఫరీక్షించాలి. లేదంటే సాంకేతిక లోపాలు తలెత్తి క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటివారి ఆవిష్కరణకు సరైన గుర్తింపు, ఆర్థిక మద్దతు, సాంకేతిక మార్గదర్శకత్వం అవసరం. కానీ ప్రభుత్వాలు ఇలాంటివారిని ప్రోత్సహించవు. కేవలం విదేశీలకు వేల కోట్లు ధారపోస్తాయి. టెక్నాలజీని అరువు తెచ్చుకుంటాయి.
Bihar teen Avanish Kumar, has created a flying plane using only scrap in just a week with a cost of around Rs 7,000.
బీహార్ కి చెందిన యువకుడు Avanish Kumar తన చుటూ ఉన్న స్క్రాప్ తో వారం రోజులోనే ఫ్లైయింగ్ ప్లేన్ ని తయారు చేశారు. 7000 రూపాయల ఖర్చుతో ఈ ప్లేన్ ని తయారు చేశారు.… pic.twitter.com/i5E8Ika2xJ
— s5news (@s5newsoffical) July 28, 2025