Atmanirbhar Bharat Initiative: ఆత్మ నిర్భర్ భారత్.. మేక్ ఇన్ ఇండియా.. కోవిడ్ తర్వాత భారత ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకాలు.. కోవిడ్ సమయంలో ఎదురైనా సవాళ్లనుంచి పాఠాలు నేర్చుకున్న కేంద్రం.. మనకు అవసరమైన వస్తువులు మనమే తయారు చేసుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోదీ ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ పథకాల్లో ఇప్పటికే వందే భారత్ రైళ్లు తయారవుతున్నాయి. అనేక ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. తాజాగా పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత మనకు శత్రువులు ఎవరో తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో అనమకు అవసరమైన యుద్ధ విమానాలను కూడా సొంతంగా తయారు చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో పాత మిగ్ – 21 యుద్ధ విమానాలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో వాటిస్థానంలో ఐదో తరం యుద్ధ విమానాలు సమకూర్చుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. అమెరికాకు చెందిన ఎఫ్–35, రష్యాకు చెందిన యూ–57 యుద్ధ విమానాలు ఈ రంగంలో గేమ్–ఛేంజర్‌లుగా భావిస్తుంది. అమెరికా యొక్క ఎఫ్–35ని ఎంచుకోవచ్చని తెలుస్తోంది.
Also Read: ప్రపంచ నాయకుడిగా మోదీ.. రికార్డు స్థాయిలో ప్రజాదరణ!
ఎఫ్ – 35 ఎంపికకు కారణాలు..
అమెరికాకు చెందిన ఎఫ్–35 యుద్ధ విమానం ప్రపంచంలోనే అత్యంత అధునాతన స్టెల్త్ టెక్నాలజీని కలిగి ఉంది, ఇది శత్రు రాడార్లు గుర్తించకుండా దాడి చేస్తుంది. దీని నెట్‌వర్క్–సెంట్రిక్ యుద్ధ సామర్థ్యాలు, యుద్ధ రంగంలో డేటా షేరింగ్, రియల్–టైమ్ సమన్వయాన్ని అందిస్తాయి. ఇది ఆధునిక యుద్ధంలో కీలకం. అదనంగా, ఎఫ్–35 పాకిస్తాన్‌లోని ఉగ్రవాద దాడులపై కచ్చితమైన సర్జికల్ స్ట్రైక్‌లను నిర్వహించడంలో అత్యంత సమర్థవంతంగా ఉంటుంది. ఈ విమానం యుద్ధ పరిస్థితులలో తన సామర్థ్యాన్ని రుజువు చేసుకుంది. ఇది భారత్‌కు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. అయితే, ఆయుధాల సమీకరణలో పరిమితులు, టెక్నాలజీ షేరింగ్‌పై అమెరికా విధించే ఆంక్షలు సవాళ్లుగా ఉన్నాయి.
యూ–57 ప్రత్యేకతలు ఇవీ..
ఇక రష్యాకు చెందిన యూ–57 భారత్ యొక్క ఇప్పటికే ఉన్న రక్షణ వ్యవస్థలతో, ముఖ్యంగా సుఖోయ్ యూ–30 ఎంకేఐ విమానాలతో అనుకూలతను కలిగి ఉంది. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా సహ–ఉత్పత్తి అవకాశాలను అందిస్తుంది, ఇది భారత్‌కు సాంకేతిక బదిలీ, స్థానిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. యూ–57 ధర సాపేక్షంగా తక్కువగా ఉండవచ్చు. రష్యాతో భారత్ చారిత్రక రక్షణ సంబంధాలు ఈ ఎంపికను సులభతరం చేస్తాయి. అయితే, యూ–57 స్టెల్త్ సామర్థ్యాలు, ఆధునిక టెక్నాలజీ ఎఫ్–35తో పోలిస్తే కొంత వెనుకబడి ఉండవచ్చు, ఇది భారత్‌ను ఎఫ్–35 వైపు మొగ్గేలా చేస్తుంది.
ఆత్మనిర్భరత వైపు అడుగు..
భారత్ స్వదేశీ అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్ట్(ఏఎంసీఏ) ఆత్మనిర్భర భారత్ లక్ష్యంలో ఒక మైలురాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్నీ నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్, తక్కువ రాడార్ క్రాస్–సెక్షన్, సూపర్‌క్రూయిజ్ సామర్థ్యంతో రూపొందించబడుతోంది. ఏఎంసీఏ సుఖోయ్ యూ–30 ఎంకేఐ విమానాలకు వారసుడిగా భావించబడుతుంది. దీని ఉత్పత్తి 2035 నాటికి ప్రారంభమవుతుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ భారత్‌ను ఐదో తరం యుద్ధ విమానాలను రూపొందించే అరుదైన దేశాల సమూహంలో చేర్చుతుంది. అయితే దీర్ఘకాలిక గడువు కారణంగా ఐఏఎఫ్‌కి తక్షణ అవసరాలను తీర్చడానికి విదేశీ విమానాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
Also Read: మాల్దీవులు తగ్గింది.. మోడీ కాళ్ల కిందకి వచ్చింది.. నెత్తి మీద పెట్టుకుంది..
ఐఏఎఫ్ ఆధునికీకరణకు గేమ్–ఛేంజర్
ఎఫ్–35 ఎంపిక ఐఏఎఫ్ ఆధునికీకరణ ప్రక్రియకు గణనీయమైన ఊతమిస్తుంది. దీని అధునాతన స్టెల్త్, సెన్సార్ ఫ్యూజన్, కచ్చితమైన స్ట్రైక్ సామర్థ్యాలు చైనా, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలతో యుద్ధ సన్నాహాలలో భారత్‌కు ఆధిపత్యాన్ని అందిస్తాయి. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించడంలో ఎఫ్–35 సామర్థ్యం భారత్ యొక్క రక్షణ వ్యూహానికి కీలకమైన అంశం. అయితే, ఏఎంసీఏ దీర్ఘకాలిక అభివృద్ధి ఐఏఎఫ్‌కి స్వదేశీ సామర్థ్యాలను అందిస్తుంది.