Govt Employees Job Security: సాధారణంగా మనం ఇంటో ఏదైనా పని ఉంటే ఆ పని చేయడానికి.. దానిలో అనుభవం లేదా దాని గురించి తెలిసినవారిని పిలుస్తాం.. పని చేయడానికి ఎంత తీసుకుంటాడో అడిగి నచ్చితే పనిచేయిస్తా.. పనితీరు బాగుంటూ వెళ్లేటప్పుడు ఓ వంద రూపాయలు ఎక్కువ ఇస్తా.. నచ్చకుంటే.. తెల్లవారి అతడి స్థానంలో కొత్తవాడిని తెచ్చుకుంటా.. ఇది ఒక ఇంటికి సంబంధించిందే కాదు.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే. పోటీ మార్కెట్‌లో నిలబడాలంటే.. పని తీరు బాగుండాలి.. పోటీని తట్టుకుని నిలబడేలా పనిచేయాలి.. లేదంటే మనకు జీతాలు ఇచ్చే సంస్థలు ఉద్యోగాల నుంచి తొలగిస్తాయి. ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా అనేక బడా కంపెనీలు కూడా ఉద్యోగుల్లో నైపుణ్యం లేదని, అవసరం లేదని, ఆర్థిక మాంద్యం అని కారణాలు చూపుతూ తొలగిస్తున్నాయి. అయితే ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారత దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అవసరం లేకపోయినా.. ప్రభుత్వ ఉద్యోగులను పెంచి పోషిస్తున్నాయి. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను జీతాలుగా ఇస్తున్నాయి. ఇక ఉద్యోగులు ఖాళీగా ఉన్నా.. లంచాలు తీసుకోవడం మానడం లేదు. మెరుగైన రీతిలో పని చేయడం లేదు. అయినా వారిని తొలగించే సాహసం ప్రభుత్వాలు చేయడం లేదు. అయినా తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయాలన్న ఆలోచన చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు లేదు. ఇదే ఇప్పుడు భారతీయులకు భారంగా మారింది.
Also Read: టెస్లాకు పోటీ.. డ్రైవర్ లెస్ ట్రాక్టర్ రెడీ.. అట్లుంటదీ ఇండియన్స్ తోని
అసమాన రక్షణ వలయం..
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రభుత్వ ఉద్యోగులకు అసాధారణ రక్షణ కల్పిస్తుంది. ఈ రక్షణ, పనితీరు లేదా అవసరం లేకున్నా వారిని తొలగించడం దాదాపు అసాధ్యం చేస్తుంది. అయితే, ఈ విధానం సగటు భారతీయుడిపై ఆర్థిక, సామాజిక భారాన్ని మోపుతోంది. సగటు భారతీయుడి వార్షిక ఆదాయం రూ.1,14,705 కాగా, ప్రభుత్వ ఉద్యోగి సంపాదన రూ.7–8 లక్షలు. ఇందుకు తోడు, జీవితకాల పెన్షన్, కుటుంబ పెన్షన్ వంటి సౌకర్యాలు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల ద్వారా చెల్లించబడతాయి. భారతదేశంలో 4 కోట్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వీరు దేశ జనాభాలో 3% కంటే తక్కువ ఉన్నప్పటికీ, ఆర్థిక వనరులపై గణనీయమైన భారంగా ఉన్నారు. ప్రైవేటు రంగంలో మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, స్విగ్గీ వంటి సంస్థలు అవసరం లేని ఉద్యోగులను తొలగిస్తుండగా, భారత ప్రభుత్వ వ్యవస్థలో ఇలాంటి సంస్కరణలు లేవు.
అవినీతి, బాధ్యతారాహిత్యం
ఆర్టికల్ 311 ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతను కల్పిస్తుంది, కానీ ఇది అవినీతి, బాధ్యతారాహిత్యాన్ని ప్రోత్సహిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. లంచాలు, పోలీస్ సెటిల్‌మెంట్‌లు, బిల్డింగ్ పర్మిషన్‌లలో అవినీతి సర్వసాధారణం. ప్రభుత్వ స్కూల్స్, ఆస్పత్రుల్లో నాసిరకం సేవలు అందుతున్నాయి, ఎందుకంటే ఈ సేవలను ప్రభుత్వ ఉద్యోగులు తమ కుటుంబాల కోసం ఉపయోగించరు. అలాంటప్పుడు మనం ఉద్యోగులకు ఎందుకు భరించాలి. మనం ప్రభుత్వాలు జీతాలు ఎందుకు ఇవ్వాలి.
ఆ ఆర్టికలే రక్షణ..
సర్దార్ పటేల్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి నాయకులు ఆర్టికల్ 311ని రాజకీయ జోక్యం, దుర్వినియోగం నుంచి ఉద్యోగులను కాపాడేందుకు రాజ్యాంగంలో చేర్చారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రక్షణ వ్యవస్థ అవసరం లేని ఉద్యోగులను కొనసాగించడానికి, అవినీతిని ప్రోత్సహించడానికి దారితీస్తోంది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక.. అవసరం లేని 1,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. అర్జెంటీనా ప్రభుత్వం కూడా గడిచిన ఏడాదిన్నర కాలంలో 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. ఇది ఆదేశ జనాభాలో 10 శాతం. మన భారత దేశంలో మాత్రం ఒక్క ఉద్యోగిని కూడా అవసరం లేదని తొలగించిన దాఖలాలు లేవు. కారణం ఆర్టిక్ 311.
Also Read: భారత్‌పై చైనా వాటర్ బాంబ్.. జలయుద్ధం తప్పదా?
సంస్కరణలు చేయాలి..
రాజకీయ ప్రతీకారాల కోసం కాకుండా, పారదర్శకంగా అవసరం లేని ఉద్యోగులను తొలగించే వ్యవస్థ తీసుకురావాలి. శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు ఆధారిత నియామకాలను ప్రోత్సహించాలి. పని చేయకపోతే ఉద్యోగం ఊడుతుందన్న భయం కల్పించాలి. ఉద్యోగ భద్రత పనితీరుతో ముడిపడి ఉండాలి. లేకపోతే బాధ్యతారాహిత్యం కొనసాగుతుంది. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో 4.5 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం అసమాన రక్షణ వ్యవస్థ కొనసాగడం సమంజసం కాదు. కానీ పని చేయని వారిని తొలగించడం మాత్రం అవసరం. ఆర్టికల్ 311ని రద్దు చేయడం లేదా సవరించడం, పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశం ఆర్థిక, సామాజిక సమానత్వం వైపు అడుగులు వేయవచ్చు.