World’s Smallest Country Tuvalu: డబ్బు సంపాదించడానికి.. మంచి జీవితం పొందడానికి.. ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటారు. అయితే కొందరు తమ ప్రాంతం పై ఉన్న అభిమానంతో ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టారు. అలాగే నీటి ప్రాజెక్టులు కడుతున్న సమయంలో ఒక ఊరు మునిగిపోతుందంటే పక్క ఊరికో.. లేదా వేరే ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటుంది.. కానీ కొందరు మనుషులు కాదు.. ఒక గ్రామం కాదు.. ఏకంగా ఒక దేశమే వలస వెళ్తోంది. ఎన్నో ఏళ్లుగా సముద్రాన్ని నమ్ముకుని .. ఆ గడ్డపై జీవిస్తున్న ప్రజలకు ఇప్పుడు ఆ సముద్రమే శాపంగా మారింది. దీంతో అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచి మరో దేశంలోకి వెళ్తున్నారు. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లి జీవించడం అంటే కష్టతరమైన పనే. మరి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ దేశం ఎలాంటి హెచ్చరిక చేసింది..?
Also Read: ప్రపంచ నాయకుడిగా మోదీ.. రికార్డు స్థాయిలో ప్రజాదరణ!
పసిఫిక్ మహాసముద్రం ఒడ్డున ఉన్న అతి చిన్న దేశం తువాలు. ఈ దేశంలోని ప్రజలు ఇప్పుడు పక్కన ఉన్న ఆస్ట్రేలియాకు తరలి వెళ్తున్నారు. ఎందుకంటే నాసా అంచనా ప్రకారం ఈ దేశం మరికొంత కాలంలో మునిగిపోతుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రమట్టం పెరిగిపోతుంది. తువాలు దేశం సముద్రమట్టానికి రెండు మీటర్ల ఎత్తులో ఉంది. కానీ త్వరలో సముద్రం 15 సెంటీమీటర్ల కు పైకి వచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు. దీంతో ఇప్పటికే ఈ దేశంలోకి సముద్రపు నీరు చొచ్చుకు వచ్చింది. తాగునీరు కలుషితమైంది.
తువాలు దేశంలోని ప్రజలు సముద్రం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. సముద్రంలో దొరికే చేపలతో వ్యాపారం చేస్తారు. అలాగే కొబ్బరి తోటలను పెంచుతారు. అయితే ఇప్పుడు సముద్రం మట్టం పెరగడంతో కొబ్బరి తోటలు మునిగిపోతున్నాయి. దీంతో వారు ఈ దేశాన్ని విడిచిపెట్టగ తప్పడం లేదు.
ఈ నేపథ్యంలో తువాలు దేశం పక్కనే ఉన్న ఆస్ట్రేలియా తో ‘ ఫాలేపిలీ యూనియన్ ట్రీటీ ‘ అనే ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తువాలు దేశం నుంచి ఆస్ట్రేలియాకు వచ్చేవారికి విద్య, వైద్యం అందిస్తారు. ఆస్ట్రేలియా దేశంతో సమానంగా వారిని చూస్తారు. ఇప్పటికే తువాలు దేశం నుంచి ఆస్ట్రేలియాకు 8750 మంది వెళ్లారు. వీరికి లాటరీ ద్వారా వీసాను అందించారు. ఇప్పుడు వీరు ఆస్ట్రేలియా సంస్కృతి తో అలవాటు పడాలి. అయితే ఇలా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లి జీవించడం కష్టతరమైన పని.
Also Read: భారత్ వ్యూహాత్మక దౌత్యం.. యూకే ట్రేడ్ డీల్.. అమెరికాకు షాక్!
ఇలా ఒక దేశం సముద్రంలో మునిగిపోతుందంటే అందుకు కారణం మానవ తప్పిదమే అని కొందరు పర్యావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. నగరికరణ పేరుతో కొందరు పర్యావరణాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో భూతాపం పెరిగి మంచు కొండలు కరిగిపోతున్నాయి. ఇలా కరిగి సముద్రం అట్టం పెరుగుతుంది. మరికొన్ని ఏళ్ళు ఇలాగే జరిగితే తువాలు దేశం మాత్రమే కాకుండా సముద్ర తీరాన ఉండే ఎన్నో దేశాలు సముద్ర గర్భంలో కలిసిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పటికైనా మానవులు పర్యావరణంపై ప్రత్యేక దృష్టి పెట్టి భూతాపం పెరగకుండా చర్యలు తీసుకోవాలని కొందరు కోరుతున్నారు.