https://oktelugu.com/

డిగ్రీ పూర్తి చేస్తే 50వేలు.. ఇంటర్ పాసైతే 25వేలు..

ఓట్లు రాల్చే హామీలకు రాజకీయ పార్టీలు పదును పెడుతున్నాయి. ఎక్కడ కొడితే ఓట్లు రాలుతాయో గుర్తించి మరీ గురిచూసికొడుతున్నారు. తద్వరా ఓట్లు సంపాదించి రాజకీయ అదికారం పొందుతున్నాయి. తాజాగా ఇంటర్ పాసైతై రూ.25వేలు.. డిగ్రీ పాస్ అయితే రూ.50వేలు ఇస్తానంటూ ఓ సిట్టింగ్ సీఎం విద్యార్థులకు ఎన్నికల హామీ ఇచ్చాడు. ఇదిప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. Also Read: నిరుద్యోగులకు ప్రధాని మోదీ శుభవార్త..? బీహార్ లో మూడు దశల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 243 నియోజకవర్గాలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 26, 2020 / 09:19 AM IST
    Follow us on

    ఓట్లు రాల్చే హామీలకు రాజకీయ పార్టీలు పదును పెడుతున్నాయి. ఎక్కడ కొడితే ఓట్లు రాలుతాయో గుర్తించి మరీ గురిచూసికొడుతున్నారు. తద్వరా ఓట్లు సంపాదించి రాజకీయ అదికారం పొందుతున్నాయి. తాజాగా ఇంటర్ పాసైతై రూ.25వేలు.. డిగ్రీ పాస్ అయితే రూ.50వేలు ఇస్తానంటూ ఓ సిట్టింగ్ సీఎం విద్యార్థులకు ఎన్నికల హామీ ఇచ్చాడు. ఇదిప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది.

    Also Read: నిరుద్యోగులకు ప్రధాని మోదీ శుభవార్త..?

    బీహార్ లో మూడు దశల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 243 నియోజకవర్గాలకు అక్టోబర్ 28న తొలి విడత పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 3న రెండో విడత, నవంబర్ 7న మూడో విడత పోలింగ్ జరుగనుంది. నవంబర్ 10న ఫలితాలు వెల్లడిస్తారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నగారా మోగిండచంతో వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రజలకు పెద్ద ఎన్నికల హామీని ప్రకటించారు. తాజాగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని యోచిస్తున్న నితీష్ కుమార్ ఏకంగా ప్రజలపై బ్రహ్మాస్త్రాన్ని వదిలారు.

    ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో పాసైన బాలికలకు రూ.25వేలు.. డిగ్రీ పాసైన అమ్మాయిలకు రూ.50వేలు అందజేయనున్నట్లు నితీష్ ఎన్నికల హామీని ప్రకటించారు. గత ఎన్నికల్లో సంపూర్ణ మధ్యపాన నిషేధం అమలుచేసిన బీహార్ సీఎం నితీష్ మహిళల ఓట్లను గంపగుత్తగా పొందారు. తాజాగా యువతరం మనసు దోచే ఆఫర్ ప్రకటించారు.

    Also Read: రెండోసారి అధికారంలో దూకుడుగా మోడీ పరిపాలన

    కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి ఆర్థిక సాయం చేస్తామని బీహార్ సీఎం నితీష్ తెలిపారు. ఇక నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత ప్రోత్సాహానికి ఒక కొత్త శాఖను ఏర్పాటు చేస్తామని సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.