Modi 3.0: మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా మోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణం చేశారు. ఆయనతోపాటు 76 మంది మంత్రులు ప్రమాణం చేశారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై మోదీ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. కీలక శాఖలను బీజేపీ మంత్రలకే కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మోదీ 2.0 స్కార్‌లో పనిచేసిన 37 మంత్రులకు మోదీ 3.0 ప్రభుత్వంలో చోటు దక్కలేదు. వీరిలో ఆరుగురు కేబినెట్ ర్యాంకు మంత్రులు ఉండగా, 30 మంది సహాయ మంత్రులు ఉన్నారు.
Also Read: Modi: ఐదుగురు గెలిస్తే.. ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు… మోదీ స్కెచ్ మామూలుగా లేదు
ఛాన్స్ కోల్పయిన కేబినెట్ మంత్రులు వీరే..
మోదీ 2.0 సర్కార్‌లో స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ్‌రాణే, పరుషోత్తం రూపాలా, అర్జున ముండా, ఆర్‌కే.సింగ్, మహేంద్రనాథ్ పాండే కేబినెట్ మంత్రులుగా ఉన్నారు. వీరికి 3.0 ప్రభుత్వంలో అవకాశం దక్కలేదు. మరోవైపు ప్రస్తుతం మంత్రి పదవి కోల్పయిన వారిలో 18 మంది సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. గత ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఉండి, లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మంత్రి పదవి నిలుపుకున్నారు ఎల్.మురుగన్.
Also Read: Modi Cabinet : మోదీ 3.0 : కేంద్రంలో ఏ రాష్ట్రానికి ఎన్ని మంత్రి పదవులో తెలుసా?
పదవి దక్కని మాజీ మంత్రులు వీరే..
మోదీ 3.0 ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కని నేతలు.. వీకే.సింగ్, ఫగ్గణ్‌సింగ్ కుస్తే, అశ్విని చైబే, దన్వే రావ్‌సాహెబ్ దాదారవ్, సాధ్వీ నిరంజన్ జ్యోతి, సంజీవ్ బల్యాన్, రాజీవ్ చంద్రశేఖర్, సుభాష్ సర్కార్, నిశిత ప్రమాణిక్, రాజ్‌కుమార్ రంజన్ సింగ్, ప్రతిమా భౌమిక్, మీనాక్షి లేఖి, ముంజపరా మహేంద్రభాయ్, అజయ్‌కుమార్ మిశ్రా, కైలాశ్ చౌదరీ, కపిల్ మోరేశ్వర్ పాటిల్, భారతీ ప్రవీణ్ పవార్, కౌశల్ కిశోర్, భగవంత్ ఖుబా, వి.మురళీధరన్, భాను ప్రతాప్‌సింగ్ వర్మ, జాన్ బార్లా, బశ్వేశ్వర్ టుడు, భగవత్ కిషన్‌రావు కరాడ్, దేవుసిన్హ్ చౌహాన్, అజయ్ భట్, ఎ.రారాయణస్వామి, సోమ్ ప్రకాశ్, రామేశ్వర్ తేలి, దర్శనా విక్రమ్ జర్దోశ్ లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు.