Car Loan: ఈ బ్యాంకులో కారు లోన్ పై అతి తక్కువ వడ్డీ.. రూ. 10 లక్షలకు ఈఎంఐ ఎంతంటే?

Car Loan: కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ తీసుకుంటాయి. అయితే, ఆ బ్యాంకులు ఏవి.? ఎంత తక్కువ పడుతుంది? అనేది తెలియక వినియోగదారులు ఇబ్బంది పడుతుంటాడు.

Written By: Neelambaram, Updated On : June 10, 2024 3:08 pm

Lowest interest on car loan in this bank

Follow us on

Car Loan: బ్యాంకులు హౌసింగ్ లోన్లతో పాటు వాహనాలను కొనాలనుకుంటున్నా లోన్లు ఇస్తుంటాయి. రెండింటికీ వడ్డీ మాత్రం వేర్వేరుగా ఉంటుంది. ఇందులో మళ్లీ బ్యాంకుకు, బ్యాంకుకు మారుతుంటుంది. ఒక్కో బ్యాంకు ఒక్కో వడ్డీ రేటు వసూలు చేస్తుంది. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ తీసుకుంటాయి. అయితే, ఆ బ్యాంకులు ఏవి.? ఎంత తక్కువ పడుతుంది? అనేది తెలియక వినియోగదారులు ఇబ్బంది పడుతుంటాడు.

కారు లోన్ గురించి వివరంగా తెలుసుకుందాం?
వాహనం కొనుగోలు చేయాలనుకునేవారు ఏ బ్యాంక్ తక్కువ వడ్డీ రేట్లు అందజేస్తుందో చెక్ చేసుకోవాలి. వాహనాల గురించి అత్యంత అవగాహన ఉన్న
బ్యాంక్ బజార్ ఏం చెప్తుందంటే బ్యాంకింగ్ రంగంలో దేశంలోనే అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో మాత్రమే ఆటో రుణాలపై తక్కువ వడ్డీ ఉందట. ఎస్‌బీఐలో కారు లోన్స్ పై వడ్డీ రేట్లు ఏడాదికి 8.75 శాతం నుంచి 9.80 శాతం వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మరో మెలిక పెట్టింది బ్యాంకు వడ్డీ రేటు సిబిల్ స్కోర్, వాహనం రకం మారుతుంటుందని చెప్పింది. మీ సిబిల్ స్కోర్ బాగుంటే, కనీస వడ్డీకి లోన్ పొందవచ్చు.

క్రెడిట్ స్కోర్ అతి పెద్ద అంశం
మీరు ఎస్‌బీఐ నుంచి కారు లోన్ తీసుకున్నట్లయితే.. మీ క్రెడిట్ స్కోర్ 800 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మూడు నుంచి ఐదేళ్ల కాలంలో లోన్‌పై వడ్డీ 8.85 శాతంగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ 775-779 మధ్య ఉంటే, అదే కాలానికి సంబంధించి వడ్డీ 9 శాతంగా ఉంటుంది. సిబిల్ స్కోర్ 757-774 మధ్య ఉంటే వడ్డీ 9.10 శాతంగా ఉంటుంది. మీరు ఎస్‌బీఐ వెబ్‌సైట్ sbi.co.in/web/interest-rates/interest-rates/loan-schemes-interest-rates/auto-loansలోకి వెళ్లి క్రెడిట్ స్కోర్ ద్వారా మీరు ఏ వడ్డీ పరిధిలోకి వస్తారో తెలుసుకోవచ్చు.

10 లక్షలపై ఎంత?
మీరు ఐదేళ్ల కాలానికి రూ. 10 లక్షలు తీసుకుంటే, మీ సిబిల్ 800 కంటే ఎక్కువ ఉంటే.. 8.85 శాతం వడ్డీ రేటుతో లోన్ పొందుతారు. దీని ప్రకారం.. మీ నెలవారీ ఈఎంఐ రూ. 20,686 ఉంటుంది. ఐదేళ్లలో రూ. 12,41138 అంటే రూ. 2,41,138 వడ్డీగా చెల్లించాలి. లోన్ తీసుకునే ముందు బ్యాంకు అధికారిక సైట్‌లో వడ్డీ రేటు, షరతులను చెక్ చేసుకోవాలి.