https://oktelugu.com/

Balakrishna BB4: ‘బిబి4’ సినిమాలో బాలయ్య పోషించబోయే రెండు పాత్రలు ఇవే…

Balakrishna BB4: ఇప్పుడు వీళ్ళు నాలుగోసారి కూడా మంచి విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక బోయపాటి గత సంవత్సరం రామ్ తో చేసిన స్కంద సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేదు.

Written By:
  • Gopi
  • , Updated On : June 10, 2024 / 02:46 PM IST

    two roles that Balayya will play in the movie BB4

    Follow us on

    Balakrishna BB4: ఇక ఈరోజు బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ని వదిలారు. ఇక డైలాగ్ తో వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం యూ ట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇక ఇదిలా ఉంటే బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో ‘బిబి 4 ‘ అనే వర్కింగ్ టైటిల్ తో బాలయ్య బోయపాటి సినిమాను అనౌన్స్ చేశారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే వీళ్ళ కాంబో లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ సాధించడంతో హ్యాట్రిక్ సాధించిన కాంబినేషన్ గా వీళ్ళకి మంచి గుర్తింపు అయితే లభించింది.

    ఇక ఇప్పుడు వీళ్ళు నాలుగోసారి కూడా మంచి విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక బోయపాటి గత సంవత్సరం రామ్ తో చేసిన స్కంద సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేదు. ఇక దాంతో ఇప్పుడు బాలయ్యతో ఎలాగైనా సరే ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక బాలయ్య బాబుకి కూడా వరుసగా మూడు విజయాలు దక్కాయి. ఇప్పుడు బాబీ తో మరో సక్సెస్ ని సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన సక్సెస్ లను దాటి ఈ సినిమాలు ముందుకు కదలడం లేదు.

    Also Read: Kalki Trailer: కల్కి ట్రైలర్ లీక్: హైలెట్స్ ఇవే.. నిడివి ఎంతంటే?

    ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా అయితేనే అది రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక బోయపాటి బాలయ్యను చూపించడం లో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు. అందువల్లే ఆయన క్యారెక్టరైజేశన్ గాని, ఆయన డైలాగ్ డెలివరీ గాని, ఆయన హావభావాలు గాని అన్ని సినిమాల్లో కంటే బోయపాటి సినిమాల్లో చాలా డిఫరెంట్ గా ఉంటాయనే పేరైతే వచ్చింది…

    ఇక బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో ఒకటి ఎమ్మార్వో పాత్ర కాగా, ఇంకొకటి ఆర్మీ ఆఫీసర్ పాత్ర గా తెలుస్తుంది. ఇక ఈ రెండు పాత్రల్లో బాలయ్య అదరగొట్టడానికి రెడీ అవుతున్నాడు…

    Also Read: Suriya: సూర్య కొత్త సినిమాను పుష్ప తో ఎందుకు పోలుస్తున్నారు…