బీహార్ కు చెందిన కూలి పనులు చేసుకుంటూ అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూరు అంజనాద్రి నగర్ లో నివాసం ఉంటున్నాడు స్థానికంగా శనివారం ఓ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇనుపరాడ్డుతో తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రూ.60 వేల విలువైన బంగారం, 70 గ్రాముల వెండి, రూ.4 వేలు, చరవాణి స్వాధీనం చేసుకున్నారు.
బిర్యానీ, చిరుతిళ్లకు అలవాటుపడి సునాయాసంగా డబ్బు సంపాదించేందుకు చోరీలకు పాల్పడ్డాడు. గతంలోనూ అతడిని అదుపులోకి తీసుకుని బాలనేరస్తుల హోమ్ కు తరలించగా విడుదలైన తరువాత కూడా చోరీలు కొనసాగిస్తున్నాడు. స్థానికంగా తాళం వేసిన ఇళ్లను ఎంచుకుని గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సీఐ వెల్లడించారు.
ఆ బాలుడి వయసు 13 ఏళ్లు. కానీ అతడిపై ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలోనే 10 కేసులు నమోదయ్యాయి. తాజాగా రెండు రోజుల క్రితం ఆ బాలుడు మునగనూరు అజనాద్రినగర్ లో చోరీకి పాల్పడడంతో అరెస్టు చేశారు. విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఆరు నెలల కాలంలోనే హయత్ నగర్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్నట్లు హయత్ నగర్ సీఐ సురేందర్ గౌడ్ తెలిపారు.