Homeఅంతర్జాతీయంIndia Russia Oil Supply: భారత్‌కు అండగా రష్యా.. చమురు కష్టాలు తీరినట్లే!

India Russia Oil Supply: భారత్‌కు అండగా రష్యా.. చమురు కష్టాలు తీరినట్లే!

India Russia Oil Supply: ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధ కారణంగా ఇంధన సరఫరాకు ఆటకం ఏర్పడింది. ఇరాన్‌ ఆర్మూజ్‌ జలసంధిని మూసివేసింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వందలాది నౌకలు నిలిచిపోయాయి. మరోవైపు ఇరాన్‌ దాడితో గల్ఫ్‌ దేశాల్లో ఆయిల్‌ ఉత్పత్తి, సరఫరాకు అంతకాయం కలిగింది. దీంతో ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్‌ దిగుమతిదారులు అయిన చైనా, భారత్‌తోపాటు యుపోపియన్‌ యూనియన్‌పై ప్రభావం పడనుంది. ఇప్పటికే ఆయిల్‌ ధరలు పెరిగాయి. ఈ ప్రభావం భారత్, చైనాపై ఎక్కువగా ఉండనుంది. దీంతో ఈ రెండు దేశాలు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నాయి.

Also Read: విజయ్–రష్మిక పెళ్లి రిసెప్షన్.. ప్రముఖుల సందడి.. వైరల్ పిక్స్

85 శాతం దిగుమతి..
భారత్‌ తన ఇంధన అవసాల్లో 85 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఇందులో 60 శాతం గల్ఫ్‌ దేశాల నుంచే దిగుమతి అవుతుంది. ఆర్మూజ్‌ జలసంధి మూసివేసిన నేపథ్యంలో ఈ 60 శాతం దిగుమతి నిలిచిపోయింది. ప్రస్తుతం దేశంలో 20 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ దిగుతులపై భారత్‌ గల్ఫ్‌ దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు రష్యాతో చర్చలు జరుపుతోంది.

సరఫరాకు రష్యా అంగీకారం..
యుద్ధం కారణంగా ఏర్పడిన ఆయిల్‌ కొరతను తీర్చేందుకు రష్యా ముందుకు వచ్చింది. అతిపెద్ద చమురు దిగుమతిదారులు అయిన భారత్, చైనాకు అవసరమైన ఆయిల్‌ సరఫరాకు సిద్ధమని తెలిపింది. లోటు చమురును తామే పూడుస్తామని వెల్లడించింది. అమెరికా ఒత్తిడితో ఇటీవలే భారత్‌ రష్యా ఆయిల్‌ దిగుమతి తగ్గించింది. కానీ ప్రస్తుత యుద్ధ పరిస్థితులతో అమెరికా ఒత్తిడిని పక్కన పెట్టింది. దేశ అవరసాలకే ప్రాధాన్యం ఇచ్చింది. రష్యా ఆయిల్‌ దిగుమతులు పెంచేందుకు సిద్ధమైంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version