
నిహారిక పెళ్లికి తూతూ మంత్రంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇక మెగా హీరోల ఇంట పండుగలు, వేడుకలు, సినిమా ఫంక్షన్లకు పవన్ పెద్దగా హాజరు కాడు.. అటు రాజకీయాలు, ఇటు సినిమాల హోరులో పవన్ పెద్దగా ఆయన కుటుంబంతో కలవడు అన్న పేరుంది. ఇక మృధు స్వభావి.. పెద్దగా జనంలోకి రాని పవన్ తీరుతో మెగా ఫ్యామిలీ చాలా సార్లు ఇబ్బంది పడింది.
అయితే ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ వచ్చాడు. మెగా స్టార్ చిరంజీవి 66వ పుట్టినరోజుకు ప్రత్యేక ఆకర్షణగా పవన్ నిలిచాడు. ఎప్పుడూ పండుగలకు రాని పవన్ స్వయంగా వచ్చేసరికి మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ ను గట్టిగా కౌగించుకొని ముద్దు పెట్టాడు. దానికి పవన్ సైతం గట్టిగా హత్తుకొని అన్నయ్య ప్రేమకు బదులిచ్చాడు. తాజాగా చిరు బర్త్ డే వేడుక వీడియోను స్వయంగా మెగా ఫ్యామిలీ విడుదల చేయడంతో వైరల్ అయ్యింది.
మెగాస్టార్ 66వ పుట్టినరోజు పండుగను ఘనంగా నిర్వహించారు. చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు చిరుకు బర్త్ డే విషెస్ తెలిపారు. పవన్ కళ్యాణ్ రాకతో అటు కుటుంబ సభ్యులతోపాటు ఇటు అభిమానులు కూడా ఎంతో సంతోషించారు. పవన్ ను చూడగానే చిరంజీవి ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకొని తమ్ముడితో సంతోషం పంచుకున్నారు. అనంతరం వదిన సురేఖను చూసిన పవన్ ‘ఏంటండి సురేఖ గారు.. ఎలా ఉన్నారు?’ అంటూ ఆటపట్టించారు. సురేఖ పవన్ జబ్బపై ఒక్కటేసింది. అనంతరం గట్టిగా పట్టుకుంది.
ఇలా మెగా స్టార్ చిరంజీవి ఇంట్లో బర్త్ డే వేడుక ఈసారి అంగరంగ వైభవంగా సాగింది. మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతూ ట్రెండింగ్ గా మారాయి.
చిరంజీవి బర్త్ డే వేడుక అధికారిక వీడియో ఇదీ

