https://oktelugu.com/

1,061 మంది పోలీసులకు కరోనా పాజిటివ్!

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజలే కాదు.. డాక్టర్లు, పోలీసులు కూడా కరోనా బారినపడుతున్నారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1,061 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 112 మంది అధికారి స్థాయి పోలీసులు ఉన్నారు. ఇప్పటికే 9 మంది పోలీసులు చనిపోగా… 174 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి […]

Written By: , Updated On : May 15, 2020 / 04:55 PM IST
Follow us on

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజలే కాదు.. డాక్టర్లు, పోలీసులు కూడా కరోనా బారినపడుతున్నారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1,061 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 112 మంది అధికారి స్థాయి పోలీసులు ఉన్నారు. ఇప్పటికే 9 మంది పోలీసులు చనిపోగా… 174 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మిగిలిన వారు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 27,524కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 6059 మంది కోలుకోగా.. 1019 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 20,441 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదైన విషయం తెలిసిందే.