పవన్ సరసన కేరళ కుట్టీ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలతో బీజీగా మారారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ ను తెలుగులో ‘వకీల్ సాబ్’గా తెరకెక్కిస్తున్నారు. పవన్ కల్యాణ్ తొలిసారి లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీలో లావణ్య త్రిపాఠి, నివేథా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకోగా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. […]

Written By: Neelambaram, Updated On : మే 15, 2020 4:48 సా.
Follow us on

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలతో బీజీగా మారారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ ను తెలుగులో ‘వకీల్ సాబ్’గా తెరకెక్కిస్తున్నారు. పవన్ కల్యాణ్ తొలిసారి లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీలో లావణ్య త్రిపాఠి, నివేథా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకోగా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. షూటింగ్లు ప్రారంభం కాగానే ఈ మూవీని త్వరగా కాంప్లీట్ చేసి విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అదేవిధంగా క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీలో పవన్ నటిస్తున్నాడు. మొగల్ సామ్రాజ్య కథాంశంతో ఈ సినిమా ఉండనుంది. ఇందులో పవన్ రాబీన్ హుడ్ తరహా పాత్రలో కన్పిస్తాడనే ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే పవర్ స్టార్ తో దర్శకుడు హరీష్ శంకర్ ఓ మూవీని తెరకెక్కించనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లలో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. పవన్ రీ ఎంట్రీ తర్వాత గబ్బర్ సింగ్ కాంబో సెట్టవడంతో అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో పవన్ సరసన కొత్త భామను తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. పవన్ కు జోడీగా కేరళ బ్యూటీ మానస రాధాకృష్ణన్ అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తుందట. ఈమేరకు చిత్రబృందం ఆమెకు ఆఫర్లు ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తోంది. అయితే దర్శకుడు హరీష్ శంకర్ దీనిపై స్పందిస్తూ హీరోయిన్ విషయంలో ఇంకా ఎవరూ అనుకోలేదని త్వరలోనే నటీనటులు, టెక్నిషియన్ల వివరాలను ప్రకటించనున్నట్లు చెప్పారు. పవన్-మాసన రాధాకృష్ణన్ జోడీ చూడముచ్చటగా ఉండటంతో ఆమె పేరే ఖరారయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ మూవీ ప్రారంభిస్తే గానీ పవన్ సరసన నటించే లక్కీ భామ ఎవరో క్లారిటీ రానుంది. అంతవరకు వేచిచూడాల్సిందే..!