Homeఆంధ్రప్రదేశ్‌Gold Prices: వారంలో రూ.1000 తగ్గింది.. బంగారం, వెండి కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..

Gold Prices: వారంలో రూ.1000 తగ్గింది.. బంగారం, వెండి కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్..

Gold Prices: బంగారం ధరలు మరోసారి తగ్గాయి. గత వారం రోజుల నుంచి ధరలు కొనుగోలుదారులకు అనుకూలంగానే ఉంటున్నాయి. ఆరు రోజుల్లో మొత్తం రూ.950 వరకు బంగారం ధరలు తగ్గాయి. అలాగే వెండి ధరలు కూడా తగ్గడం కొనుగోలుదారులకు ఊరట నిస్తోంది. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. జనవరి 9న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.63,050 గా ఉంది. జనవరి 8న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,000తో విక్రయించారు. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు రూ. 200 మేర తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,950 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,200గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,800 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.63,050 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.58,300 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,600తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,800 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,050తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,800తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,050తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.76,400గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం వెండి ధరు రూ.200 తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.76,400గా ఉంది. ముంబైలో రూ.76,400, చెన్నైలో రూ.77,800, బెంగుళూరులో 73,500, హైదరాబాద్ లో రూ.77,800తో విక్రయిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular