India
India: ” డబ్బున్న వాడు మరింత డబ్బును సంపాదిస్తున్నాడు.. పేదవాడు మరింత పేదరికం అనుభవిస్తున్నాడు. దేశంలో ఈ వ్యత్యాసం ఎందుకు” శివాజీ సినిమాలో రజనీకాంత్ పలికిన డైలాగ్ ఇదీ. దానికి తగ్గట్టుగానే మనదేశంలో పరిస్థితి ఉన్నది. తాజాగా బ్లూమ్ వెంచర్స్ అంచనా ప్రకారం 100 కోట్ల మంది భారతీయుల వద్ద ఖర్చుకు డబ్బులు లేవట. స్వేచ్ఛగా ఖర్చు చేసేది 13 నుంచి 14 కోట్ల మందేనట.
Also Read: రాజకీయాల నుంచి రాజ్ భవన్ కు.. ఆ సీనియర్ నేత ఆశ ఫలిస్తుందా?
మనదేశంలో జనాభా 140 కోట్లు మించింది. అయినప్పటికీ 100 కోట్ల మంది భారతీయుల సంపాదన అంతంత మాత్రం గానే ఉంది. స్వేచ్ఛగా ఖర్చు చేయడానికి వారి వద్ద డబ్బులు లేవు.. కేవలం 13 నుంచి 14 కోట్ల మంది మాత్రమే స్వేచ్ఛగా ఖర్చు చేయగలుగుతున్నారు. ఈ జనాభా మొత్తం మెక్సికో పాపులేషన్ కు సమానం.. మరో 30 కోట్ల మంది ఆశావహ వినియోగదారులు. ఇప్పుడిప్పుడు మాత్రమే వారు తమ పర్సుల నుంచి డబ్బులు తీయడం మొదలు పెడుతున్నారు. వీరు ఖర్చు అంతంత మాత్రం గానే చేస్తున్నారు.. మన దేశం ఆశయాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ.. వినియోగదారుల్లో ఒక వర్గం మాత్రం ఖర్చు అంతంతమాత్రంగానే చేస్తోంది. ధనవంతులు మరింత డబ్బును పోగేస్తున్నారు. అందువల్ల మార్కెట్ దిశ మొత్తం మారిపోతున్నది. ఫలితంగా ప్రీమియమైనైజేషన్ ట్రెండ్ పెరుగుతోంది. అనేక బ్రాండెడ్ కంపెనీలు ధనవంతుల కోసమే ఖరీదైన ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. ఎంత విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటు అవుతున్నాయి. ఐఫోన్ వంటి ప్రీమియం మొబైల్స్ విక్రయాలు పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉండే గృహాలు ఇప్పుడు 18 శాతానికి పడిపోయాయి. ఐదు సంవత్సరాల క్రితం ఇది 40% గా ఉండేది. మార్కెట్లో బ్రాండెడ్ ఉత్పత్తుల మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. ఖరీదైన సేవలకు గిరాకీ పెరిగింది..
కోవిడ్ తర్వాత
కోవిడ్ తర్వాత డబ్బున్న వాళ్ళు మరింత శ్రీమంతులయ్యారు.. పేదలు మరింత పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. అయితే ఈ ట్రెండ్ కోవిడ్ కంటే ముందే మొదలైనప్పటికీ.. కోవిడ్ తర్వాత ఆర్థిక అసమానత దేశంలో పెరిగింది. ఇక మనదేశంలో ఉన్న సంపదలో 57.7 శాతం 10 శాతం మంది భారతీయుల వద్దే ఉంది. దేశ జనాభాలో ఆర్థిక స్తోమత ఉన్న వారి శాతం గతంలో 22.2 శాతం ఉండగా.. ఇప్పుడు అది 15 శాతానికి పడిపోయింది.. కోవిడ్ వల్ల శ్రీమంతులు విభిన్నమైన వ్యాపారాల్లోకి వెళ్లిపోయారు. ప్రభుత్వాలు కూడా వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాయి. ఫలితంగా వారి ఆదాయం అంచనాలకు మించి పెరిగింది. ఇక ఇదే సమయంలో పేదల ఆదాయం మరింత తగ్గిపోయింది. వారికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అల్పాదాయ వర్గాలు ఈ స్థాయిలో ఇబ్బంది పడటం గతంలో దేశంలో ఎన్నడు లేదు. అయితే ఈ పరిస్థితి ఇప్పట్లో మారే అవకాశం లేదు. ఎప్పుడు మారుతుందో తెలియదని ఆర్థికవేత్తలు అంటున్నారు. ప్రభుత్వాలు విధానాలు మార్చుకోవాలని.. ఆర్థిక విధానాలలో మార్పులు తేవాలని.. అప్పుడే పేదలు బాగుపడతారని ఆర్థికవేత్తలు వివరిస్తున్నారు.
Also Read: పోసాని అరెస్ట్.. రంగంలోకి జగన్.. ప్రచార అస్త్రంగా ఆ సామాజిక వర్గం