Yanamala Rama Krishnudu
Yanamala Rama Krishnudu: తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో కురువృద్ధుడు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే అధినేత చంద్రబాబు కంటే సీనియర్. అటువంటి నేత ఇప్పుడు గౌరవప్రదమైన పదవీ విరమణ కోరుకుంటున్నారు. కానీ పార్టీ పట్టించుకునే పరిస్థితిలో లేదు. దీంతో ఆ వృద్ధ నేత బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నాయకత్వంతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఆయనే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. మార్చి నెలాఖరుతో ఆయన ఎమ్మెల్సీగా రిటైర్ అవుతారు. అయితే గౌరవప్రదమైన ఒక పదవి ఇచ్చి.. తన రాజకీయ జీవితానికి ముగింపు పలకాలని భావిస్తున్నారు యనమల రామకృష్ణుడు.
Also Read: వర్మ బదులు వంగవీటి రాధా.. దేవినేని కి గ్రీన్ సిగ్నల్.. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు వారే!
* టిడిపి ఆవిర్భావం నుంచి..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ వచ్చారు యనమల రామకృష్ణుడు( yanamala Ramakrishna ). పార్టీలో చాలామంది సీనియర్లు పక్క చూపులు చూశారు కానీ.. యనమల రామకృష్ణుడు మాత్రం ఎన్నడు పార్టీ మారలేదు. పార్టీ లైన్ దాటలేదు. అధినేతకు విధేయుడు గానే పనిచేశారు. అయితే చంద్రబాబు సైతం యనమల విషయంలో ప్రత్యేక భావనతో ఉండేవారు. అయితే లోకేష్ నేతృత్వంలోనే యువ నాయకత్వం వచ్చిన తర్వాత యనమల రామకృష్ణుడి హవా తగ్గినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఏది ఎలాగున్నా తనకు మాత్రం రాజ్యసభ పదవి కానీ.. గవర్నర్ పదవి కానీ.. ఆ రెండు కాకుంటే ఎమ్మెల్సీగా ప్రమోట్ చేసి మంత్రిని చేయాలని కోరుతున్నారు యనమల. కానీ పార్టీ హైకమాండ్ నుంచి ఆశించిన స్థాయిలో సమాధానం రాలేదని తెలుస్తోంది.
* సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా
1983 నుంచి 1999 వరకు తూర్పుగోదావరి( East Godavari ) జిల్లా తుని అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు యనమల రామకృష్ణుడు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి మంత్రి పదవి దక్కించుకున్నారు. 1994లో మాత్రం స్పీకర్ పదవి చేపట్టారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా ఉన్న యనమల రామకృష్ణుడిని మంత్రి చేశారు చంద్రబాబు. కానీ ఈ ఎన్నికల్లో తాను తప్పుకొని కుమార్తె దివ్యకు అవకాశం ఇచ్చారు యనమల. ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా రిటైర్ అవుతున్నారు యనమల రామకృష్ణుడు.
* మరోసారి రెన్యువల్ చేస్తారా
అయితే యనమల రామకృష్ణుడికి మరోసారి ఎమ్మెల్సీగా( MLC) రెన్యువల్ చేయరన్న ప్రచారం నడుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఒకవేళ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే.. మంత్రిగా ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే యనమల మాత్రం రాజ్యసభ పదవి పై ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో గవర్నర్ పోస్ట్ ఇస్తే.. రాజకీయాలు విడిచిపెట్టి రాజ్ భవన్ లో అడుగుపెడతానని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆశావాహులు అధికం అయ్యారు. అదే సమయంలో లోకేష్ టీం ఎంట్రీ అయింది. తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని వర్గాలకు అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే ఈ యనమల ఆశలు నీరుగారినట్టే. ఒకవేళ చంద్రబాబు కలుగ చేసుకుంటే మాత్రం యనమల ఆశిస్తున్నట్టు గౌరవప్రదమైన పదవీ విరమణ దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: పోసాని అరెస్ట్.. రంగంలోకి జగన్.. ప్రచార అస్త్రంగా ఆ సామాజిక వర్గం!