https://oktelugu.com/

Hyderabad: ప్రజలను పిచ్చి ‘పుల్లయ్య’ చేసి రూ.100 కోట్లతో పరారీ!*

18 సంవత్సరాల కిందట పుల్లయ్య దంపతులు ఉపాధి వెతుక్కుంటూ హైదరాబాదులో( Hyderabad) అడుగుపెట్టారు. బి కే కూడా రవీంద్ర కాలనీ సమీపంలోని ఓ కాలనీలో నివాసం ఉండేవారు.

Written By: , Updated On : February 27, 2025 / 03:24 PM IST
Hyderabad (1)

Hyderabad (1)

Follow us on

Hyderabad: ఆయనకు అక్షరం రాదు. అస్సలు చదువుకోలేదు( illiterate). అడ్డా కూలీగా జీవనం ప్రారంభించాడు. అందరితో పరిచయాలు పెంచుకున్నాడు. అందరి నమ్మకాన్ని పొందాడు. చిట్టీల వ్యాపారం లోకి అడుగు పెట్టాడు. అనతి కాలంలోనే కోటీశ్వరుడు అయ్యాడు. కట్ చేస్తే 100 కోట్ల రూపాయలతో పరారయ్యాడు. ఈ ఘరానా మోసం భాగ్యనగరంలో వెలుగు చూసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్యం పల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య( pullayya )భూలక్ష్మి దంపతులు స్థానికంగా ఉపాధి లేక.. 18 ఏళ్లు కిందట హైదరాబాద్ వెళ్ళిపోయారు. అప్పటినుంచి అంచలంచెలుగా ఎదుగుతూ కోటీశ్వరులు అయ్యారు. కానీ ఇప్పుడు ప్రజలకు 100 కోట్ల రూపాయలు శఠగోపం పెట్టారని తెలిసి సొంత గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు.

Also Read: ఆంధ్రజ్యోతిపై కవితక్క పగ ఇప్పటిది కాదా? అందుకే అంతటి ఆగ్రహమా?

* ఉపాధి వెతుక్కుంటూ
18 సంవత్సరాల కిందట పుల్లయ్య దంపతులు ఉపాధి వెతుక్కుంటూ హైదరాబాదులో( Hyderabad) అడుగుపెట్టారు. బి కే కూడా రవీంద్ర కాలనీ సమీపంలోని ఓ కాలనీలో నివాసం ఉండేవారు. చదువు లేకపోవడంతో పుల్లయ్య కొన్ని నెలల పాటు అడ్డా కూలీగా పని చేశాడు. అలా స్థానికులతో పరిచయం పెంచుకొని కూలి పనులు మానేశాడు. చిట్టిల వ్యాపారంలో అడుగుపెట్టి గత 15 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాడు. వేల రూపాయలతో ప్రారంభమైన చిట్టి లక్షలకు చేరింది. వ్యాపార విస్తరణ సైతం పెరుగుతూ వచ్చింది. తొలినాళ్లలో గుడిసెల్లో నివాసం ఉన్న పుల్లయ్య.. అదే ఏరియాలో విలాసవంతమైన ఇల్లు కూడా కట్టుకున్నాడు.

* నయా మోసం
అయితే చిట్టిల వ్యాపారంలో( chitfund business ) కొత్త విధానంతో మోసం ప్రారంభించాడు. ఎవరైనా చిట్టీలు పడుకున్న కస్టమర్లకు అధిక వడ్డీ ఆశ చూపేవాడు. అలా వారు పాడుకున్న డబ్బులను తన వద్ద ఉంచుకునే వాడు. మళ్లీ అదే సభ్యులకు చిట్టీలు కట్టించుకునే వాడు. అయితే అందరికీ నమ్మకస్తుడు కావడంతో చాలామంది అధిక వడ్డీ ఆశ చూపి నేరుగా నగదు ఇవ్వడం కూడా ప్రారంభించారు. ఇలా దాదాపు 2000 మంది వరకు చిట్టీలు కట్టినట్లు తెలుస్తోంది. చిట్టీలు వేసిన వారికి ఈ నెల 23 నుంచి 26 లోపు డబ్బులు చెల్లిస్తామని నమ్మ పలికాడు. తీరా కస్టమర్స్ ఇంటికి వచ్చేసరికి పరారయ్యాడు. ఈనెల 21నే కుటుంబ సభ్యులతో పరారైనట్లు తెలుస్తోంది. ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయామని గ్రహించారు కస్టమర్స్.

* కొనసాగుతున్న ఆందోళనలు
ప్రస్తుతం పుల్లయ్య(pullayya ) ఇంటివద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. వందలాదిమంది బాధితులు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. కొందరు మహిళలు బోరున విలపించడం కనిపించింది. బాధితుల లెక్కల ప్రకారం 100 కోట్లకు పైగా డబ్బులు చెల్లించకుండా పుల్లయ్య వ్రాయించాడని తెలుస్తోంది. పుల్లయ్య ఇంట్లో డబ్బులు లెక్క పెట్టేందుకు ఐదు కౌంటింగ్ మిషన్లు కూడా ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. మొత్తానికైతే అక్షరం ముక్క రాని వాడు 100 కోట్ల రూపాయలతో ఉడాయించాడంటే.. ఎలాంటి మోసానికి పాల్పడ్డాడు ఇట్టే అర్థమవుతుంది.

 

Also Read: రాజకీయాల నుంచి రాజ్ భవన్ కు.. ఆ సీనియర్ నేత ఆశ ఫలిస్తుందా?