Homeఎంటర్టైన్మెంట్Varanasi vs Spirit movie: వారణాసి vs స్పిరిట్... ఏ మూవీ మీద ఎక్కువ అంచనాలు...

Varanasi vs Spirit movie: వారణాసి vs స్పిరిట్… ఏ మూవీ మీద ఎక్కువ అంచనాలు ఉన్నాయంటే..?

Varanasi vs Spirit movie: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవాళ్లకు మాత్రమే గుర్తింపు ఉంటుంది. ఒక సక్సెస్ సాధించడానికి చాలామంది హీరోలు నానా తంటాలు పడుతుంటే కొంతమంది మాత్రం అలవోకగా సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీ హిట్ల ను సైతం తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇక రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న విషయం మనకు తెలిసిందే…ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలు చాలావరకు వైవిధ్యభరితమైన కథాంశాలతో తెరకెక్కినవే కావడం విశేషం… ఆయన మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమాతో పాన్ వరల్డ్ లో సైతం తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు సాధించబోతున్న విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…ఇక ఎవరికీ సాధ్యం కాని రీతిలో సక్సెస్ లను సాధించిన ఘనత కూడా తనకే దక్కింది. ఇక వారణాసి సినిమా మీద భారీ బజ్ ఉన్నప్పటికి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన సందీప్ రెడ్డి వంగ సైతం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవడమే కాకుండా ఇండియాలో తనను మించిన దర్శకుడు మరెవరు లేరనెంతలా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమా సైతం పాన్ వరల్డ్ లో రిలీజ్ అవుతుండడం విశేషం… ఇక సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు నుంచి వచ్చే సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉంటుందని ప్రతి ఒక్కరు ఆయన సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ప్రభాస్ హీరో కావడంతో ఇండియా వైడ్ గా ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి…

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో హరీష్ శంకర్ అబద్దాలు ఆడుతున్నాడా..? ఆధారాలతో సహా దొరికిపోయాడుగా!

ఇక వారణాసి వర్సెస్ స్పిరిట్ సినిమా మధ్య జరుగుతున్న పోటీలో ఏ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది. ఏ సినిమా డిలా పడిపోతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వచ్చే సంవత్సరం మార్చి 5వ తేదీన స్పిరిట్ సినిమాను రిలీజ్ చేయడానికి సందీప్ రెడ్డివంగ ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా వచ్చిన నెల రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒకే సంవత్సరంలో రెండు భారీ సినిమాలు రావడం సినిమా ఇండస్ట్రీకి శుభపరిణామం అనే చెప్పాలి… ఇక రెండు సినిమాల మీద భారీ బజ్ అయితే ఉంది. ఇందులో ఏ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...

AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?!

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత...

AP Government Door To Door Campaign: చేసింది చెప్పేందుకు…ఏపీలో 45 రోజుల కూటమి ప్రచారం!

AP Government Door To Door Campaign: ఏపీలో టీడీపీ కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో మూడేళ్ల పాలన ఉంది. తొలి రెండేళ్లు కూటమి పాలనపై సంతృప్తి శాతం అధికంగా...
Oktelugu Epaper
Exit mobile version