
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా నలుగుతున్నారు. అందుకు కారణం జగన్ సర్కార్ తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలకు అనేకమంది ప్రజలు ఇబ్బంధులు పడుతున్నారు. వైసీపీ తీసుకొచ్చిన “కొత్త ఇసుక పాలసీ” వల్ల ఇసుక కొరత ఏర్పడం వల్ల అనేక లక్షల భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడటంలో పవన్ కళ్యాణ్ వైజాగ్ లో లాంగ్ మార్చ్ నిర్వహించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో “ఇంగ్లిష్ మీడియం” తప్పనిసరి చేయడంతో.. తెలుగు భాష కనుమరుగౌతుందని, పవన్ కళ్యాణ్ “మన నుడి మన నది” కార్యక్రమంతో జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
జనసేన వైజాగ్ లాంగ్ మార్చ్ విజయం కావడం అలాగే “మన నుడి మన నది” కి అనేకమంది ప్రముఖులు మద్దతు తెలియజేయడంతో.. వైసీపీ నేతలు తట్టుకోలేక పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అలాగే ఆయనను “చంద్రబాబు దత్త పుత్రుడని”, “డి ఎన్ ఏ అని”,” ప్యాకేజి స్టార్” అని విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా.. చంద్రబాబు హయంలో నోరు మెదపని పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని చాలా విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ ట్వీట్ ని చూడండి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ ఎలా విమర్శించారో తెలుస్తుంది.
“మనసాక్షి సాక్షిగా ఈ సాక్షి పెద్ద” “జర్నలిజానికి సరైనఅర్థం చెప్పిన సాక్షి కి ” అని జనసేన ప్రకాష్ ట్వీట్ చేసాడు.
మనసాక్షి సాక్షిగా ఈ సాక్షి పెద్ద “chameleon🔥
జర్నలిజానికి సరైనఅర్థం చెప్పిన సాక్షి కి 100k followers congratulations 🤪 pic.twitter.com/0GvTG1If7n— p̳r̳a̳k̳a̳s̳h̳ (@prakash1148) November 27, 2019
తెలుగువాడి మనసాక్షి సాక్షి ఛానల్ కు సూటి ప్రశ్నలు? @SakshiHDTV
మాది tdp b team అని గగ్గోలు పెట్టే మీకు మీ ఛానల్ లో ఈ న్యూస్ వేసినపుడు ఎందుకు గుర్తు రాలేదు మాది b team అని? pic.twitter.com/zRaYre8m0v
— p̳r̳a̳k̳a̳s̳h̳ (@prakash1148) September 22, 2019