
తెలంగాణ 17 టోల్ ప్లాజాల్లో ఫాస్ట్ టాగ్ అమలు చేస్తున్నామని వెల్లడించారు తెలంగాణ రీజనల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్. దేశవ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
ఫాస్ట్ టాగ్ ని సదరు వాహనాదారుని వాహనానికి అమర్చి ఈ టాగ్ ని బ్యాంక్ అకౌంట్ కి అనుసంధానం చేస్తారు. మొబైల్ వాలెట్ నుండి కానీ ప్రత్యేక కౌంటర్ లలో రీఛార్జి చేసుకోవచ్చు. ఈ ఫాస్ట్ టాగ్ ద్వారా టోల్ ప్లాజా నుండి సులువుగా వేల్లోపోవచ్చు. సమయం ఎక్కువగా ఆదా అవుతుంది. టోల్ ప్లాజాల దగ్గర ప్రత్యేక సిబ్బంది ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ట్రక్కులకు కూడా దీన్ని అనుసంధానం చేయడం వల్ల ఆ ట్రక్కు వాహనం ఏ టోల్ ప్లాజా దాటింది అనేది తెలుసుకోవచ్చు.
ఫాస్ట్ టాగ్ యాప్ ద్వారా కూడా ఫాస్ట్ టాగ్ కోసం వాహదారుడూ అప్లై చేసుకోవచ్చు. ఫాస్ట్ టాగ్ లైన్ లో ఫాస్ట్ టాగ్ లేకుండా టోల్ రుసుము కట్టకుండా వెళ్తే రెట్టింపు టోల్ వసూలు చేస్తారు. 24 గంటల్లో ఒక్క టోల్ ప్లాజా నుండి అప్ అండ్ డౌన్ ప్రయాణం చేస్తే రాయితీ కూడా వస్తుంది.