spot_img
Homeఎంటర్టైన్మెంట్Nani Bloody Romeo casting: నాని 'బ్లడీ రోమియో' లో పవన్ కళ్యాణ్ , ప్రభాస్..?...

Nani Bloody Romeo casting: నాని ‘బ్లడీ రోమియో’ లో పవన్ కళ్యాణ్ , ప్రభాస్..? వైరల్ అవుతున్న డైరెక్టర్ సుజిత్ లేటెస్ట్ పోస్ట్!

Nani Bloody Romeo casting: ‘ఓజీ’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ సుజిత్ నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) తో కలిసి ‘బ్లడీ రోమియో'(Bloody Romeo) అనే చిత్రం చేస్తున్నాడు. రీసెంట్ గానే నాని పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన యానిమేషన్ కాన్సెప్ట్ వీడియో ని ఒకటి విడుదల చేశారు. దీనికి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం ప్రమోషనల్ కంటెంట్ తోనే ఒక సినిమాకు భారీ హైప్ ని తీసుకొని రావాలంటే సుజిత్ తర్వాతే ఎవరైనా అంటూ ఈ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు . ఇదంతా పక్కన పెడితే లేటెస్ట్ గా ఆయన తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇది చూసిన తర్వాత సుజిత్ ‘బ్లడీ రోమియో’ తో ఎదో పెద్ద ప్లాన్ వేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

ఇంతకీ ఆయన ఏమి పోస్ట్ చేసాడంటే , పవన్ కళ్యాణ్ ఓజీ , ప్రభాస్ సాహూ ఫొటోలతో పాటు , నేచురల్ స్టార్ నాని ‘బ్లడీ రోమియో’ ఫోటోలను కలిపి, ‘బిల్ట్ డిఫరెంట్ ..బోర్న్ నెంబర్ 1.. మై గ్యాంగ్ స్టర్స్’ అంటూ పోస్ట్ చేసాడు . ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అంటే సుజిత్ ఈ పోస్ట్ ద్వారా ఫ్యాన్స్ కి ఇస్తున్న హింట్ ఏమిటంటే, ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ ఓజీ , ప్రభాస్ సాహూ పాత్రలు కూడా కనిపిస్తాయని, సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం షేక్ అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే సుజిత్ ఓజీ 2, ఓజీ 3 చిత్రాలపై ఫోకస్ పెట్టబోతున్నాడు.

Also Read: పవన్ కళ్యాణ్ మరోసారి డైరెక్షన్ చేయబోతున్నారా..? కథేంటి ఇంత వైలెంట్ గా ఉంది..?

ఈ రెండు సినిమాలు ఒకేసారి మొదలు అవుతాయట. పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్స్ ని బట్టీ ఈ రెండు సినిమాల షూటింగ్స్ ని చేస్తారట. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ఒక పెద్ద రైటింగ్ టీం అందుకోసం పని చేస్తుందట. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక నాని తో చేయబోయే ‘బ్లడీ రోమియో ‘ మూవీ ఈ ఏడాది సమ్మర్ నుండి మొదలు కానుంది. ఈ ఏడాది డిసెంబర్ లోపు షూటింగ్ పూర్తి చెయ్యాలని చూస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

America Politics: అమెరికాకు యువ అధ్యక్షురాలు.. పోల్స్ తో ఈ 36 ఏళ్ల మహిళకే ఓటు

America Politics: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అయింది. నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంతకుముందు జోబైడెన్‌ అధ్యక్షుడిగా...

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version