Homeఆంధ్రప్రదేశ్‌టీడీపీ నేత చింతమనేని అరెస్ట్..!

టీడీపీ నేత చింతమనేని అరెస్ట్..!


పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కలపర్రు టోలు గేటు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇక్కడికి టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. సంఘటన సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే ఈ.ఎస్.ఐ కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ని అరెస్టు చేసి విజయవాడ తరలిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్ ప్లాజా వద్ద అచ్చెన్నాయుణ్ని తరలిస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేతృత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఎమ్మెల్యే చింతమనేని ని అదుపులోకి తీసుకునే క్రమంలో టిడిపి కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు చింతమనేని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలను టోల్ ప్లాజా సమీపం నుంచి వెళ్లగొట్టారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Telangana Employee Health Scheme: తెలంగాణ ఉద్యోగులు గుడ్‌ న్యూస్‌.. 40 ఏళ్లు దాటితే ఫ్రీ హెల్త్‌ చెకప్‌!

Telangana Employee Health Scheme: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారి సంక్షేమం కోసం ‘నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం’ (ఎన్‌ఈహెచ్‌ఎస్‌) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం...

Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....

Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...
Oktelugu Epaper
Exit mobile version