Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’ వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా విడుదల చేసిన ‘తబాహి’ పాటకు యూత్ ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకు ముందు విడుదల చేసిన ‘లేడీస్ & లేడీస్’ టీజర్ కి కూడా బ్లాస్టింగ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు ఈ చిత్రం నుండి ‘మనసాగదే’ అనే పాటని విడుదల చేశారు. ‘టాబాహి’ పాటలో యాష్ కియారా అద్వానీ తో రొమాన్స్ చేయగా, ఈ పాటలో ఆయన ‘తారా సుతారియా ‘ తో రొమాన్స్ చేశారు. అయితే ‘తబాహి’ పాటలో యాష్ , కియారా మధ్య జరిగిన ఘాటు రొమాన్స్ ని యూత్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు .
అదే సమయం లో కియారా అద్వానీ పై తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. పెళ్ళైన అమ్మాయి , ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి ఎలా ఒప్పుకుంది?, చాలా ఆశ్చర్యం గా ఉందే అంటూ కొంతమంది విమర్శించారు. నేడు విడుదల చేసిన పాటలో కూడా అదే రేంజ్ లో రొమాన్స్ ఉంటుందని ఊహించారు, ఊహించినట్టుగానే రొమాన్స్ అయితే ఉంది , కానీ మొదటి పాటలో ఉన్నంత ఘాటు అడల్ట్ రొమాన్స్ మాత్రం ఇందులో లేదు. పాట ట్యూన్ కూడా చాలా బాగా కుదిరింది. మన తెలుగు వెర్షన్ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఎప్పటి లాగానే ఈసారి కూడా ఆయన తన సాహిత్యం తో ఆకట్టుకున్నారు. ఇకపోతే ఈ పాటలో తారా సుతారియా తో పాటు నయనతార , కియారా అద్వానీ లను కూడా చూపించారు.
నయనతార ఈ చిత్రం లో హీరో యాష్ కి అక్క పాత్ర పోషించింది. ఆమె క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. మొదటి పాటలో కూడా ఆమెకు సంబంధించిన షాట్స్ కొన్ని చూపించారు. ఇక ఈ పాటలో అయితే ఆమె యాష్ తో సిగరెట్ తాగుతూ కనిపించడం గమనార్హం. ఇక పాట మధ్యలో ఒక మూల నిల్చొని యాష్ సిగరెట్ కాలుస్తున్నప్పుడు , అతని వద్దకు కియారా అద్వానీ పరిగెత్తుకుంటూ వచ్చి అతని వైపు దీనంగా చూస్తుంది. చూస్తుంటే ఈ పాటకు ముందు వీళ్లిద్దరి మధ్య బ్రేకప్ జరిగినట్టుగా అనిపిస్తోంది. ఈమెతో బ్రేకప్ అయ్యాక తారా సుతారియా తో యాష్ కొత్తగా రిలేషన్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా పాట అయితే చాలా బాగుంది , మొదటి పాటలాగానే , ఈ పాటకు కూడా యూత్ ఆడియన్స్ నుండి రాబోయే రోజుల్లో సెన్సేషనల్ రెస్పాన్స్ రావొచ్చు.



