https://oktelugu.com/

వెలుగులోకి వచ్చిన మరో కీచక పోలీసు ఉదంతం..!

గుంటూరు జిల్లా అమరావతిలో కీచక ఎస్.ఐ ఘటన మరువక ముందే ప్రకాశం జిల్లాలో మరో కీచక కానిస్టేబుల్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇటువంటి సంఘటనల కారణంగా పోలీసుల ప్రతిష్ఠ మంట కలిసేలా ఉంది. ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న కానిస్టేబుల్ ఆ మహిళ నుంచి రూ.36 లక్షలు అప్పు తీసుకుని చెల్లించకుండా వేధింపులకు గురి చేశాడు. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఒంగోలు నగరంలోని తాలూకా పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ పనిచేస్తున్న వెంకట రాజేష్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 12, 2020 / 06:31 PM IST
    Follow us on


    గుంటూరు జిల్లా అమరావతిలో కీచక ఎస్.ఐ ఘటన మరువక ముందే ప్రకాశం జిల్లాలో మరో కీచక కానిస్టేబుల్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇటువంటి సంఘటనల కారణంగా పోలీసుల ప్రతిష్ఠ మంట కలిసేలా ఉంది. ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న కానిస్టేబుల్ ఆ మహిళ నుంచి రూ.36 లక్షలు అప్పు తీసుకుని చెల్లించకుండా వేధింపులకు గురి చేశాడు.

    సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఒంగోలు నగరంలోని తాలూకా పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ పనిచేస్తున్న వెంకట రాజేష్ కు దిబ్బల రోడ్డులోని ఒక మాహిళతో పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో ఆమె న్యూడ్ వీడియోలు, ఫొటోలు తీశాడు. తన అవసరాలకు ఆ మహిళ వద్ద నుంచి రూ. 36 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు చెల్లించక పోవడంతో ఆమె నిలదీసింది.

    ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన అప్పు చెల్లిస్తామని తన స్నేహితుడు నల్లూరి సుధాకర్ ఇంటికి పిలిపించాడు. అప్పు చెల్లించకపోగా అక్కడ స్నేహితులు ఇద్దరూ కలిసి తనపై అత్యాచారం చేశారని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు విచారణ చేపట్టారు.

    ఇది ఇలా ఉండగా గుంటూరు జిల్లాలో వడ్డీ వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారు. వడ్డీ వ్యాపారుల అరాచకాలు పట్టణ ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. జిల్లాలోని కొల్లిపర మండలం చక్రాయపాలెంలో ఈ అరాచక సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆర్థిక లావాదేవీల విషయంలో వడ్డీ వ్యాపారం చేస్తున్న వీరయ్య, నర్సమ్మలు నడిరోడ్డిపై సామ్రాజ్యం అనే మహిళని హత్య చేశారు. రోడ్డుపై వెళ్తున్న సామ్రాజ్యంపై దంపతులు తొలుత దాడి చేశారు.

    అనంతరం సామ్రాజ్యం కళ్లల్లో నర్సమ్మ కారాన్ని చల్లింది. కళ్ల మంటతో కిందపడిన సామ్రాజ్యంను వీరయ్య గడ్డిపారతో పొడిచి హత్య చేశాడు. వీరయ్య దంపుతుల నుంచి సామ్రాజ్యం గతంలో తీసుకున్న అప్పు రూ.20 వేలు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో వడ్డీ వ్యాపారులు మృతురాలి పొలం, ఇంటిని బలవంతంగా రాయించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.