డ్రోన్ కేసులో పోలీసులను వదలని రేవంత్ రెడ్డి

కేసీఆర్ తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ఫౌంహౌజ్ ఇష్యూ కొద్ది రోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వర్సెస్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్లుగా ఫౌంహౌజ్ ఇష్యూ మారింది. కేటీఆర్ తన ఫౌంహౌజ్ కోసం అక్రమంగా చెరువును పూడ్చివేసి రోడ్డు వేసుకున్నారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి గ్రీన్ ట్రీబ్యూనల్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గ్రీన్ ట్రీబ్యూనల్ కేటీఆర్ కు నోటీసులకు జారీ చేసిన […]

Written By: Neelambaram, Updated On : June 12, 2020 7:01 pm
Follow us on


కేసీఆర్ తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ఫౌంహౌజ్ ఇష్యూ కొద్ది రోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వర్సెస్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్లుగా ఫౌంహౌజ్ ఇష్యూ మారింది. కేటీఆర్ తన ఫౌంహౌజ్ కోసం అక్రమంగా చెరువును పూడ్చివేసి రోడ్డు వేసుకున్నారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి గ్రీన్ ట్రీబ్యూనల్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గ్రీన్ ట్రీబ్యూనల్ కేటీఆర్ కు నోటీసులకు జారీ చేసిన సంగతి తెల్సిందే. అయితే దీనిపై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు తాత్కాలికంగా స్టే విధించింది.

కేటీఆర్ ఫౌంహౌజ్ ఇష్యూను రేవంత్ రెడ్డి ఇప్పట్లో వదిలేలా కన్పించడం లేదు. ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసులపై కూడా తాజాగా ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. డ్రోన్ కేసులో తనను అరెస్టు చేయడానికి ముందుగా పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేయకుండా అరెస్టు చేయడాన్ని ఆయన కోర్టులో సవాల్ చేశారు. మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాదరావు, నార్సింగి ఇన్స్ పెక్టర్ గంగాధర్ లపై కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేశారు.

సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం పోలీసులు తనను అరెస్టు చేయడానికి ముందుగా 41ఏ నోటీసులు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. పోలీసులు తనకు 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం కోర్టు ధిక్కరణకు కిందకు వస్తుందని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పును పోలీసులు ఉల్లంఘించారని రేవంత్ పేర్కొన్నారు. మూడునెలల క్రితం నార్సింగి పోలీసులు రేవంత్ రెడ్డిని డ్రోన్ కేసులో అరెస్టు చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి బెయిల్ పై బయటికి వచ్చి కేటీఆర్ ఫౌంహౌజ్ ఇష్యూపై పోరాటం చేస్తున్నారు. తాజాగా పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసి వారికి రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.