Telugu Girl in H-1B interview: అగ్రరాజ్యం అమెరికా హెచ్–1బీ వీసాలను కుదించింది. ముఖ్యంగా భారతీయుల వలసల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక వేధింపులు, ఆంక్షలు, నిబంధనలు మరింత కఠినతరం అయ్యాయి. దీంతో అమెరికా వెళ్లాలనుకునేవారి కలలు కల్లలయ్యాయి. ఇక అమెరికాలో ఉంటున్నవారు హెచ్–1బీ వీసా కోసం పడుతున్న తిప్పలు వర్ణనాతీతం. ఇందుకు తాజాగా ఓ యువతి హాజరైన ఇంటర్వ్యూ నిదర్శనం. కంపెనీ తరఫున వీసా కోసం ఆమె తన బాయ్‌ఫ్రెండ్ సహాయంతో ఇటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చింది. ఏమాత్రం పొరపాటు జరగకూడదని ఇలా చేసినట్ల తెలుస్తోంది. దీనికి సబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో తీసింది ఎవరు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్రియేటివ్ వీడియోనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కారులో ఇంటర్వ్యూ..
కంపెనీలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. హెచ్–1బీ వీసా నిబంధనలు కఠినం అయిన నేపథ్యంలో భారతీయులు అమెరికా వెళ్లేందుకు, డాలర్ డ్రీమ్ నెరవేర్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఓ తెలుగు యువతి అమెరికాలోనే హెచ్–1బీ వీసా కోసం అక్కడి కంపెనీ ఇంటర్వ్యూకు హాజరైంది. ఇటర్వ్యూ ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చేందుకు, ఎక్కడా పొరపాటు జరగకుండా ఉండేందుకు కారులో తన బాయ్‌ఫ్రెండ్‌ను వెనక కూర్చోబెట్టుకుంది. ఇదే సమయంలో అతను లైవ్ ఇంటర్వ్యూలో కనిపించకుండా అతనిపై బెడ్‌సీట్లు కప్పి ఉంచింది. ఇక ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు తన బాయ్‌ఫ్రెండ్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.
వీడియోపై భిన్నాభిప్రాయాలు..
ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇది క్రియేటెడ్ వీడియో అని కొందరు పేర్కొంటున్నారు. వీడియో తీయడంపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నా. కొంతమందికి తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలా చేసి ఉంటారని కామెంట్ చేస్తున్నారు. అసలు ఇంటర్వ్యూ ఇలా జరగదని కొందరు పేర్కొంటున్నారు. యువతి మరియు ఆమె బాయ్‌ఫ్రెండ్ జతగా జవాబులు ఇవ్వడం సంఘటన వాస్తవమో కాదో స్పష్టత లేదు.
A Telugu girl, an H1B candidate in an unverified scam incident, was caught with her boyfriend feeding her answers during the interview.
But, Who recorded this interview?
Or
Is this staged for viral views?
— M9 USA (@M9USA_) December 1, 2025