Massive US visa rejections: అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలి.. డాలర్లు సంపాదించాలి అనేది ఒకప్పుడు సంపన్నుల కల.. కానీ ఇప్పుడు మధ్య తరగతి వారు కూడా అమెరికా వెళ్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక సీన్ మారిపోయింది. వీసా ఆంక్షలు, నిబంధనలతో అమెరికా వెళ్లేందుకు చాలా మంది వెనుకాడుతున్నారు. అయితే ట్రంప్ రాకముందు కూడా పరిస్థితి ఇలాగే ఉంది. 2024లో ప్రపంచ దేశాలకు చెందిన చాలా వీసాలు తిరస్కరణకు గురయ్యాయి. 2024లో అమెరికా బీ1/బీ2 వీసాలు (బిజినెస్, టూరిజం) తిరస్కార రేట్లు ప్రపంచవ్యాప్తంగా భిన్నంగా ఉన్నాయి. లైచెన్‌స్టీన్, మోనాకో వంటి దేశాల్లో 0%తోపాటు, భారత్ 16.32%తో మధ్యస్థ స్థాయిలో ఉంది. ఈ డేటా ఆర్థిక స్థితి, రాజకీయ సంబంధాలు, ఇమ్మిగ్రేషన్ రిస్క్‌లపై ఆధారపడి ఉంది.
టాప్ 10 దేశాలు..
చాలా అధిక ఆదాయ దేశాలు తక్కువ తిరస్కారాలు ఎదుర్కొన్నాయి. ఇవి స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు, తక్కువ ఇమ్మిగ్రేషన్ రిస్క్ కలిగి ఉన్నాయి. తక్కువ ఆదాయ దేశాల వీసాలు ఎక్కువగా తిరస్కరణకు గురయ్యాయి. లైచెన్‌స్టీన్, మొనాకో, నార్త్ కొరియా కు చెందిన ఒక్క వీసా కూడా ఆమోదం పొందలేదు. యూఏఈ 1.46 శాతం, జపాన్ 5.76 శాతం, సౌదీ అరేబియా 7.89 శాతం వీసాలు తిరస్కరణకు గురయ్యాయి.
మధ్యస్థంగా భారత్ స్థానం..
భారత్ 16.32%తో 18వ స్థానంలో ఉంది. యూరప్ దేశాలు (ఫ్రాన్స్ 8.50%, జర్మనీ 10.02%) కంటే ఎక్కువ కానీ చైనా (25.37%), పాకిస్తాన్ (45.65%) కంటే మెరుగు. భారతీయుల్లో ఐటీ ప్రొఫెషనల్స్, విద్యార్థులు ఎక్కువగా అప్లై చేస్తున్నారు. డాక్యుమెంట్లు, ఆర్థిక నిరూపణలు బలంగా ఉంటే సక్సెస్ రేటు పెరుగుతుంది.
అధిక తిరస్కార దేశాలు..
సంఘర్షణలు, పేదరికం, ఇమ్మిగ్రేషన్ చరిత్ర కారణంగా కొన్ని దేశాల్లో 50% మించి తిరస్కారాలు జరిగాయి. ఇరాన్ 55.54 శాతం, కెనడా 56.35 శాతం, ఆఫ్గానిస్తాన్ 48.89 శాతం, నైజీరియా 46.51 శాతం, పాకిస్తాన్ 45.65 శాతం వీసాలు తిరస్కరణకు గురయ్యాయి. కెనడా వంటి అధిక ఆదాయ దేశం కూడా అధిక రేటు ఉండటం ఆశ్చర్యకరం హెచ్–1బీ వీసాలపై యూఎస్‌కు వెళ్లి బీ1/బీ2 అప్లై చేసే ట్రెండ్ కారణం.
తిరస్కారానికి కారణాలు..
వీసా ఇస్తే అమెరికాలోనే స్థిరపడతారనే అనుమానం(భారత్, చైనా వంటి దేశాల్లో ఎక్కువ). ఉద్యోగం, ఆదాయం నిరూణ లేకపోవడం, అసంపూర్ణ పత్రాలు, పారికార్డులు, యుద్ధాలు, అస్తిరణ(ఆఫ్గాన్, ఇరాన్) తదితర కారణాలతో అమెరికా వీసాలు తిరస్కరిస్తోంది. స్విట్జర్లాండ్, సింగపూర్ వంటి దేశాలు తక్కువ రేట్లు కలిగి ఉంటే, భారతీయులు బలమైన టైస్ (ఫ్యామిలీ, జాబ్) చూపించాలి.
ఈ డేటా అమెరికా వీసా పాలసీల ప్రపంచ డైనమిక్స్‌ను తెలియజేస్తుంది. భారత్ మెరుగైన స్థానంలో ఉన్నప్పటికీ, మరింత చైతన్యం అవసరం.