Samantha-Raj Nidimoru Marriage : టాలీవుడ్ స్టార్ నటి సమంత, ప్రముఖ దర్శకుడు-నిర్మాత రాజ్ నిడిమోరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొద్ది రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట, ఇవాళ కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లోని ఆలయంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

సమంత, రాజ్ నిడిమోరుతో కలిసి పలు ప్రాజెక్టులలో (ముఖ్యంగా ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌లో) పనిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారి పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు వివాహానికి దారితీసింది.

ఈ శుభవార్తతో సినీ వర్గాలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఆల్ రెడీ మూఢాలు వచ్చాయి. ఫిబ్రవరి నెల వరకూ మంచి ముహూర్తాలు లేవని పండితులు ప్రకటించారు. ఈ మూఢాల్లో పెళ్లి చేసుకున్న సమంత-రాజ్ ల వివాహం గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
View this post on Instagram