Top 10 Busiest Airports: విమానం.. ఒకప్పుడు సంపన్నుల ప్రయాణ సాధనం. కానీ ఇప్పుడు మధ్య తరగతి వారికి కూడా అందుబాటులోకి వచ్చింది. సీజనల్ వారీగా టికెట్ బుకింగ్ మెలకువలు తెలుసుకుంటే.. రాయితీలు పొందవచ్చు. దీంతో చాలా మంది ఇప్పుడు విమానాల్లో సులభంగా ప్రయాణిస్తున్నారు. ఇక ఉద్యోగాలు, ఉపాధి, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేవారు క్రమంగా పెరుగుతున్నారు. దీంతో విమానా ప్రయాణికులు పెరుగుతున్నారు. మన దేశంలో 10 ఎయిపోర్టుల నుంచి ఏటా కోట్ల మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం.. దేశంలో అత్యంత రద్దీగా ఉండే టాప్–10 ఎయిర్‌పోర్టులు ఇవే:
– ఢిల్లీ, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఇక్కడి నుంచి దేశంతోపాటు విదేశాలకు రాకపోకలు సాగిస్తారు. ఏటా ఇక్కడి నుంచి సుమారు 7.92 కోట్ల ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు.
– ముంబయి, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.. దేశ ఆర్థిక రాజధాని కావడంతో ఇది కూడా అత్యంత రద్దీగా ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా విదేశాలకు రాకపోకలు ఎక్కువ. ఏటా సుమారు 5.51 కోట్ల ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు.
– బెంగళూరు, కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఇది ఐటీ సిటీ. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ బెంగళూరులో ఉన్నాయి. దీంతో రాకపోకలు పెరిగాయి. రద్దీ పెరిగింది. ఇక్కడి నంంచి ఏటా సుమారు 4.18 కోట్ల మంది రాకపోకలు సాగిస్తారు.
– హైదరాబాద్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఇది కూడా అంతర్జాతీయ విమానాశ్రయం. విశ్వనగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు రావడంతో కంపెనీలు వస్తున్నాయి. విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు. గతేడాది సుమారు 2.91 కోట్ల మంది జర్నీ చేశారు.
– కోల్‌కతా, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఈశాన్య భారతంలో ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడి నుంచి ఏటా సుమారు 2.18 కోట్ల మంది రాకపోకలు సాగిస్తున్నారు.
– అహ్మదాబాద్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. ఉత్తర భారత దేశంలోని ప్రముఖ ఎయిర్ పోర్టుల్లో ఇదీ ఒకటి. వ్యాపార వాణిజ్యం ఎక్కువ దీంతో ఈ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోయలు సాగించేవారు పెరుగుతున్నారు. ఏటా సుమారు 1.34 కోట్ల మంది ఇక్కడి నుంచి జర్నీ చేస్తున్నారు.
– కొచ్చి, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. దక్షిణ బారత దేశంలో బెంగళూరు, హైదరాబాద్ తర్వాత రద్దీ ఎక్కువగా ఉండే విమానాశ్రయం. ఇక్కడి నుంచి ఏటా సుమారు 1.11 కోట్ల మంది ప్రయాణం చేస్తున్నారు.
– పుణె, పుణె ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.. మహారాష్ట్రలో ముంబై తర్వాత ఎక్కువ రద్దీగా ఉండే ఎయిర్ పోర్టు ఇది. ఇక్కడి నుంచి ఏటా సుమారు 1.04 కోట్ల మంది జర్నీ చేస్తున్నారు.
– గోవా, డాబోలిమ్ ఎయిర్‌పోర్ట్ ఇది పర్యాటక ఎయిర్ పోర్టు. దేశంతోపాటు ఇతర దేశాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తారు. దీంతో ఈ విమానాశ్రయం కూడా రద్దీ ఎక్కువగా ఉండే జాబితాలో చేరింది. ఏటా ఇక్కడి నుంచి సుమారు 72 లక్షల ప్రయాణికులు జర్నీ చేస్తారు.
విమానయాన రంగం అభివృద్ధి..
ఈ ప్రయాణికుల సంఖ్య గత సంవత్సరాలతో పోల్చుకుంటే విశేషంగా పెరిగి, భారత్ లో విమానయాన రంగం దీర్ఘకాల అభివృద్ధి దిశగా పయనమవుతున్నదని సూచిస్తోంది. ముఖ్య నగరాల్లో అధిక రద్దీతోపాటు, నూతన ఎయిర్‌పోర్టులు, అదనపు సేవల అభివృద్ధే ఈ పెరుగుదలకు కారణం.
దేశంలోని పది అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం ఇవి ప్రధాన ద్వారాలుగా మారాయి. ఇండియా ఎయిర్‌పోర్ట్స్‌లో నాణ్యత, సౌకర్యాలు, సాంకేతికత పరిధులపై దృష్టి పెట్టడంవల్ల ప్రయాణించేవారి సౌకర్యం పెరిగింది. ప్రత్యేకంగా ఢిల్లీ. ముంబయి ఎయిర్‌పోర్టులు ప్రపంచస్థాయి విమానాశ్రయాలు అని గుర్తింపు పొందినవి.