ఇటీవల జివికె రెడ్డి, ఆయన కుమారుడు సంజయ్ రెడ్డి, కూతురు పింకీ రెడ్డి ల వ్యాపారాలపై సిబిఐ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకం ,రద్దీ అయిన ముంబై విమానాశ్రయం కాంట్రాక్టు దక్కించుకోవటమే కాకుండా దాన్ని నడుపుతున్న జివికే రెడ్డి కుటుంబం పై సిబిఐ దాడులు చేయటం దాదాపు 700 కోట్ల రూపాయలకు పైగా నిధులు దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు మోపటం జరిగింది. ఇందులో 200 ఎకరాల్లో బోగస్ కంపెనీల పేరుతో పనులు చేసినట్లు చూపటం, దాదాపు 400 కోట్ల రూపాయలు తన స్వంత కంపెనీలకు మళ్లించటం, విమానాశ్రయం లోని షాపులు తక్కువ మొత్తానికే తమ బంధువులకు కేటాయించటం లాంటి నిర్దిష్ట ఆరోపణలు సిబిఐ చేసింది. ఆ ప్రాధమిక దర్యాప్తు నివేదిక ఆధారంగా ఇడి కూడా కేసు నమోదు చేసింది. ఇంతవరకూ పేపర్లలో వార్తలు వచ్చినా దీనివెనక ఇంకేమైనా మనకు తెలియని కధలు ఉన్నాయా అనేది ఆసక్తి రేపుతుంది.
ఈ ముంబై విమానాశ్రయ కాంట్రాక్టు యుపిఏ హయాం లో ఈ కంపెనీ దక్కించుకుంది. అప్పట్లో యుపిఏ హయాం లో ప్రతి కాంట్రాక్టు వెనక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపణలున్నాయి. ఇప్పటికే 2జి కుంభకోణం, బొగ్గు కుంభకోణం లాంటివి బయటకు రావటంతో యుపిఏ ప్రభుత్వం అప్రతిష్ట పాలయ్యింది. అలాగే ముంబై విమానాశ్రయం కాంట్రాక్టు వెనక కాంగ్రెస్ నాయకులు ఎవరున్నారనేది చర్చ నీయాంశమయ్యింది. మోడీ ప్రభుత్వానికి ఈ వ్యవహారం లో ఉప్పంద బట్టే ఈ దాడులు జరిగి వుంటాయని అనుకుంటున్నారు. అంటే ప్రముఖ కాంగ్రెస్ నాయకులకు ముడుపులు ముట్టివుంటాయి కాబట్టి వాళ్ళ భాగోతం బయటపెట్టటానికే ఈ దాడులు జరిగి ఉంటాయనేది జనం నానుడి. ఇటీవలే అహ్మద్ పటేల్ ని వేరే కుంభకోణం లో విచారించటం జరిగింది. ఈ సారి ఎవరివంతో వేచి చూడాలి.
వై ఎస్సార్ టైములో ఆంధ్రలో ఎంతోమంది ఆ సామాజికవర్గానికి చెందిన కాంట్రాక్టర్లు ఒక్కసారి పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళలో చాలామంది సరైన నాణ్యతలు పాటించకుండా డబ్బులు వెనకేసుకున్నారని తెలుస్తూంది. ఈ దాడుల తర్వాత వాళ్ళ గుండెల్లో కూడా రైళ్ళు పరిగెత్తు తున్నాయని అనుకుంటున్నారు. నిన్ననే పశ్చిమ బెంగాల్ కి చెందిన శ్రీ గణేష్ జ్యుయలరి తాలూకు అతిపెద్ద కుంభకోణం బయటకు వచ్చింది. లాక్ డౌన్ వచ్చిన తర్వాత కొంతకాలం ఆపిన సిబిఐ దాడులు తిరిగి పెద్ద ఎత్తున ప్రారంభం కావటంతో చాలామంది అక్రమసంపాదనాపరులు, కుంభకోణాలు చేసిన వాళ్ళలో ఓ రకమైన భయం అలుముకుంది. ఈ దాడుల్లో ఇంకెన్ని బొమికలు బయటపడతాయో చూడాలి.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Hidden story behind cbi raids on gvkreddy family
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com