Menopause: మహిళల శరీరంలో మార్పులే అనేవి సహజం. రజస్వల అయినప్పటి నుంచి వయస్సు పెరిగిన వరకు వాళ్ల బాడీలో ఎన్నో మార్పులు జరుగుతాయి. హార్మోన్లలో మార్పులు జరిగితే మహిళలు బాడీలో మార్పులు కనిపిస్తాయి. అమ్మాయిలకు 10 నుంచి 12 ఏళ్లు వచ్చేసరికి రజస్వల అవుతారు. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు ఇలా ఎన్నో మార్పులు వారి శరీరంలో జరుగుతాయి. వయస్సు పెరిగిన తర్వాత 45 నుంచి 50 ఏళ్ల మధ్యలో మహిళలకు రుతుక్రమం ఆగిపోతుంది. ఈ దశనే మోనోపాజ్ అంటారు. ఈ దశ నుంచి మహిళలకి నెలసరి రాదు. అయితే ఈ సమయంలో కూడా మహిళలు శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది. మహిళలకు ఈ మోనోపాజ్ దశలో లైంగికంగా ఆసక్తి తగ్గుతుంది. అసలు రుతివిరతి మహిళల లైంగిక జీవితంపై ఎలా ప్రభావం చూపుతుంది? మోనోపాజ్ దశలో మహిళల్లో లైంగిక తగ్గడానికి కారణం ఏంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.
మోనోపాజ్ దశలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఈ దశలో మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల లైంగికంగా ఆసక్తి తగ్గుతుంది. వీటితో పాటు యోని పొడిబారడం, యోనిలో నొప్పి, మంట వంటి సమస్యలు కూడా వస్తాయట. వీటివల్ల కూడా లైంగికంగా అంతగా ఇంట్రెస్ట్ చూపించలేరని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కారణాల వల్ల మహిళలు పూర్తిగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అంతగా ఇష్టపడరు. ఈ దశలో మహిళలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. ఈ సమయంలో ఒత్తిడి నుంచి విముక్తి చెందాలంటే భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలి. ఎలాంటి సమస్యలు ఉన్న వారితో పంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే యోనిలో ఎక్కువగా నొప్పి, మంట ఉంటే తప్పకుండా వైద్యుని సంప్రదించాలి.
ముఖ్యంగా మహిళలు మోనోపాజ్ దశలో ఆహారంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమయంలో వచ్చే సమస్యలను అధిగమించవచ్చు. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన నుంచి కూడా బయటపడవచ్చు. ఎక్కువగా వ్యాయామాలు చేయలేకపోతే చిన్నగా అయిన చేయాలి. వీటితో పాటు యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. కొందరికి మోనోపాజ్ దశ తొందరగా వస్తుంది. 40 ఏళ్ల తర్వాత కూడా మోనోపాజ్ దశ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. కాబట్టి ఈ వయస్సులో మూడు నుంచి నాలుగు నెలల పాటు పీరియడ్స్ రాకపోతే డాక్టర్‌ను ఒకసారి సంప్రదించండి. సరైన సమయానికి పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవడంతో పాటు నిద్రపోవడం వంటి వన్నీ చేస్తే ఈ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే ఈ మోనోపాజ్ దశలో కొన్ని సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.