https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం.. అన్నీ కలిసి వస్తాయి..

కొందరు శత్రువులతో ఇబ్బంది పెడుతారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. భవిష్యత్ గురించి కొత్త ప్రణాళికలు వేస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : October 11, 2024 / 08:08 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం కొన్ని రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనుంది. ఈరోజు ద్వాదశ రాశులపై ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఉండనుంది. అలాగే ఈరోజు సుకర్మ యోగం ఏర్పడనుంది. చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో మరికొన్ని రాశుల వారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అయితే మకర రాశి వారికి శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    కుటుంబ సభ్యులకు కావాల్సిన వస్తువులను అందిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహానికి అవసరమైన వస్తుువులు కొనుగోలు చేస్తారు.

    వృషభ రాశి:
    కొందరు శత్రువులతో ఇబ్బంది పెడుతారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. భవిష్యత్ గురించి కొత్త ప్రణాళికలు వేస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

    మిథున రాశి:
    ఆర్థిక పరిస్థితి ఆందోళనగా ఉంటుంది. కుటంబంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. బంధువులతో సంబందాలు ఏర్పడుతాయి. ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు.

    కర్కాటక రాశి:
    మానసికంగా ఆందోళనతో ఉంటారు. నిరాశతో ఉంటారు. కొన్ని నష్టాలను చవి చూస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారులతో ఇబ్బందులు పడుతారు. కొత్త వ్యక్తుల గురించి బాగా తెలుసుకోవలి. జీవిత భాగస్వామి కోసం ఖర్చులు ఉంటాయి.

    సింహారాశి:
    ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. బంధువుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. కొన్ని నష్టమైన పనులకు దూరంగా ఉండడమే మంచిది.

    కన్య రాశి:
    ఈ రాశి వారికి ఈ రోజు ఏ పని చేపట్టినా కలిసి వస్తుంది. చాలా విషయాల్లో అనుకోని అదృష్టం వరిస్తుంది. కొన్ని గమ్యాలను చేరుకోవడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు.

    తుల రాశి:
    విలాసాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. వాగ్దానాలను నెరవేర్చడంలో ముందుంటారు. తల్లిదండ్రుల సేవలో ఉంటారు. ఆర్థికపరంగా సంతృప్తితో ఉంటారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు.

    వృశ్చిక రాశి:
    వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతారు. కుటుంబ సభ్యుల సలహాతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

    ధనస్సు రాశి:
    ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కొందరు నిరుత్సాహకరమైన వార్తలు వింటారు. మనసు ఆందోళనగా ఉంటుంది. వ్యాపార పర్యటనలు ఉంటాయి. విహార యాత్రలకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

    మకర రాశి:
    ఆరోగ్య సమస్యల పై దృష్టి ఉంచాలి. ఆనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కొందరు మీ గురించి బ్యాడ్ గా ప్రచారం చేస్తారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి.

    కుంభరాశి:
    రాజకీయాలతో సంబంధం ఉన్న వారికి అనుకూల ప్రయోజనాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు ఉంటుంది.

    మీనరాశి:
    ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది.