ఆవు పాలు మంచివా..? గేదె పాలా.? గేదె పాలల్లోనే ఎక్కువగా ప్రోటీన్లు, ఫ్యాట్ ఉంటుందని అందరూ అవే తీసుకుంటారు. గేదె పాలనే ఎక్కువగా తాగుతారు. కానీ నిజానికి ఆవు పాలు తాగడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిదని తాజాగా ఓ పరిశోధన తేల్చింది. ఆ ఆవు పాలు తాగడం వలన కలిగే ప్రయోజనాలను వివరించింది.
ఆవు పాలలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. అధిక బరువు నియంత్రించడంలో ఈ పాలు చాలా ఉపయోగపడతాయట.. జీర్ణ వ్యవస్థకు చాలా దోహదపడతాయి.ఈ ఆవుపాలలో కాస్త కుంకుమ పువ్వును, చక్కెరను కలుపుకొని తీసుకుంటే ఫైల్స్ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని తేల్చారు. పిల్లల ఆరోగ్యానికి , జ్ఞాపకశక్తికి ఈ ఆవు పాలు చాలా ఉపయోగపడతాయి..
ఆవు పాలల్లో ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఏ అధికంగా ఉంటాయి. ఎముకల ధృడత్వానికి ఈ పాలు చాలా మంచిగా సహాయపడతాయి. కంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచడంలో దివ్యౌషధంలా పనిచేస్తాయి. మెదడు చురుకుదనానికి దోహదపడతాయి.